ఈశాన్య నైజీరియాలో అతిపెద్ద నగరమైన మైదుగురిలో శనివారం బోకో హరామ్ తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు.
మైదుగురి: ఈశాన్య నైజీరియాలో అతిపెద్ద నగరమైన మైదుగురిలో శనివారం బోకో హరామ్ తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. రెండు మార్కెట్లు, ఒక బస్ టెర్మినల్‌పై తీవ్రవాదులు దాడి చేశారు. ఉదయం 11:20 కి చేపలమార్కెట్‌లోకి ఆటో రిక్షాలో వచ్చిన ఆత్మాహుతి సభ్యురాలు తనను తాను పేల్చుకుంది. ఇది జరిగిన గంట తరువాత మండే మార్కెట్‌లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. మూడో దాడి మధ్యాహ్నం బోర్నొ ఎక్స్‌ప్రెస్ టెర్మినల్‌లో జరిగింది.