కోట్ల రూపాయలు గెలిచాడు.. కానీ! | Road Worker Wins 1 Million Pound, Returns to Work Next Day | Sakshi
Sakshi News home page

కోట్ల రూపాయలు గెలిచాడు.. కానీ!

May 29 2016 5:37 PM | Updated on Aug 30 2018 4:49 PM

కోట్ల రూపాయలు గెలిచాడు.. కానీ! - Sakshi

కోట్ల రూపాయలు గెలిచాడు.. కానీ!

యూకేకు చెందిన ఓ యువకుడు కార్ల్ క్రూక్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు.

లండన్: యూకేకు చెందిన ఓ యువకుడు కార్ల్ క్రూక్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం అతడిని అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా రూ.9.8 కోట్లను గెలుచుకున్నాడు. ఇంకేంటి అతడి దారిద్ర్యం పోయింది. అతడనికి మంచి రోజులొచ్చాయని తోటి కూలీలు, అధికారులు భావించారు. కానీ, క్రూక్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శుక్రవారం (మరుసటి రోజు) కూడా కూలీగా పనిచేయడానికి వచ్చాడు. ఇక అంతే.. షాక్ తో కూడిన ఆశ్చర్యానికి లోనవడం తోటి కూలీలు, అధికారుల వంతయింది.

ఒక్క రోజులో అతడ్ని అదృష్టం వరించిందని భావించలేదు. ఆ డబ్బును త్వరలో అందుకోనున్నట్లు చెప్పాడు. వచ్చే వారం డబ్బు సెటిల్ మెంట్ చేసుకుంటాను, ఇప్పటికే మా బాస్ తో ఈ విషయం చెప్పానన్నాడు. ఆడి ఆర్ఎస్5, ఓ మంచి ఇల్లు కొనుక్కుంటాను. భార్య సమంతతో కలిసి హానీమూన్ కు వెళ్తానని సంతోషంగా చెప్పుకొచ్చాడు. గతేడాది సమంతతో ఎంగేజ్ మెంట్, ఈ ఏడాది వివాహం కూడా జరిగిందని.. హనీమూన్ కోసం సమంతను ఆఫ్రికాకు తీసుకెళ్తానని క్రూక్ అంటున్నాడు.

జాక్ పాట్ కొట్టాను కదా అని డబ్బులు పిచ్చిపిచ్చిగా ఖర్చు చేసే ప్రసక్తే లేదని, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని క్రూక్ వివరించాడు. షాపులో దాదాపు 500 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాను.. కనీసం ఈ డబ్బులు అయినా తిరిగి గెలుచుకుంటానని భావించానని, ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదని కోటీశ్వరుడు కార్ల్ క్రూక్ ఆనంద భాష్పాలు రాల్చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement