విద్యార్థినులపై ఉపాధ్యాయుడి అత్యాచారం | Primary school teacher in China held for raping students | Sakshi
Sakshi News home page

విద్యార్థినులపై ఉపాధ్యాయుడి అత్యాచారం

Sep 23 2014 10:18 PM | Updated on Jul 28 2018 8:51 PM

విద్యార్థినులపై ఉపాధ్యాయుడి అత్యాచారం - Sakshi

విద్యార్థినులపై ఉపాధ్యాయుడి అత్యాచారం

చైనాలోని హుబీ ప్రావిన్స్లో ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే డింగ్ అనే 61 ఏళ్ల ఉపాధ్యాయుడు పలువురు విద్యార్థినులపై దారుణానికి పాల్పడ్డాడు.

బీజింగ్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడి అవతారమెత్తాడు. అభంశుభం తెలియని పలువురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి కటకటాలపాలయ్యాడు. చైనాలోని హుబీ ప్రావిన్స్లో  ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే డింగ్ అనే 61 ఏళ్ల ఉపాధ్యాయుడు పలువురు విద్యార్థినులపై దారుణానికి పాల్పడ్డాడు.

గతేడాది సెప్టెంబర్ నుంచి 8 నుంచి 9 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులను అత్యాచారం చేశాడు. పరీక్షలకు ముందు హోం వర్క్ చేసుకునేందుకుగాను విద్యార్థులను తన డార్మిటరీకి పిలిచి అఘాయిత్యానికి పాల్పడేవాడు. పోలీసులు టీచర్ను అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. చైనాలో విద్యార్థులపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయులకు ఇటీవల ఉరిశిక్ష విధించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement