‘ఇదేం బుద్ధి..వేరే చోటే దొరకలేదా’ | Passenger Lying Under Airplane Seat Goes Viral | Sakshi
Sakshi News home page

‘సీట్లు ఖాళీగానే ఉన్నాయిగా..ఎందుకంత కక్కుర్తి’

Sep 12 2019 5:44 PM | Updated on Sep 12 2019 5:44 PM

Passenger Lying Under Airplane Seat Goes Viral - Sakshi

కొంతమంది ప్రయాణికులు విమానంలో విచిత్రంగా ప్రవర్తిసారు. పక్కన ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుందా లేదా అన్న విషయం గురించి అస్సలు ఆలోచించరు. తమకు నచ్చిన విధంగా ఉంటూ.. తమ సౌలభ్యాన్ని మాత్రమే చూసుకుంటారనడానికి ఉదాహరణగా నిలిచారో ప్యాసింజర్‌. తొలిసారి విమానం ఎక్కారో ఏమో.. సీటును విడిచిపెట్టి వాటి కింద ఉన్న ఖాళీ స్థలంలో హాయిగా నిద్రపోయారు. ప్యాసింజర్‌షేమింగ్‌ అనే ఇన్‌స్టా పేజీలో పోస్ట్‌ చేసిన సదరు ప్యాసింజర్‌ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

ఈ క్రమంలో సదరు వ్యక్తి ప్రవర్తనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ ఇదేం బుద్ధి నీకు. సీటు ఖాళీ చేసి కింద పడుకున్నావ్‌. ఇలా చేయడం వల్ల నీ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుందన్న స్పృహ కూడా లేదా. అయినా సీట్లు ఖాళీ ఉండగా ఇదేం కక్కుర్తి. బహుశా బాగా తాగి వచ్చాడేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సదరు ప్యాసింజర్‌ సహా విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. అయినా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగాక ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా ఫేమస్‌ అవుతారో వారికి కూడా తెలియడం లేదు. మంచో.. చెడో.. ఈ ఫొటోకు వస్తున్న ఆదరణ చూశాకైనా అందులో ఉన్న వ్యక్తి నేనేనంటూ ఎవరో ఒకరు బయటికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమంటారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement