
యాపిల్ ఐ ఫోన్ 7 వస్తోందా?
ఐ ఫోన్ ఇప్పటికే సంచలనాలతో దూసుకుపోతోంది. కొత్త కొత్త రకాలను విడుదల చేసి స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను శాసిస్తోంది. ఇంతకు ముందు ఐ ఫోన్ 6 ను విడుదల చేసి సత్తా చాటిన యాపిల్ సంస్థ..
ఐ ఫోన్ ఇప్పటికే సంచలనాలతో దూసుకుపోతోంది. కొత్త కొత్త రకాలను విడుదల చేసి స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను శాసిస్తోంది. ఇంతకు ముందు ఐ ఫోన్ 6 ను విడుదల చేసి సత్తా చాటిన యాపిల్ సంస్థ.. ఆ తర్వాత 6s ను కూడ విప్లవాత్మక మార్పులతో మార్కెట్లోకి తెచ్చింది. అయితే 6.... 6s హ్యాండ్ సెట్ లు ఇంచుమించుగా ఒకేలా కనపడటంతో వినియోగదారులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు తదుపరి వెర్సన్ హ్యాండ్ సెట్ పై దృష్టి సారించిన ఓ డిజైనర్... దాని వివరాలను వెల్లడించారు.
స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తున్న ఐ ఫోన్ రాబోయే హ్యాండ్ సెట్ త్రీ డీ టచ్ స్క్రీన్ కు ఇంతకు ముందు ఎక్కడా లేని.. ఓ స్రాంప్రదాయమైన హోం బటన్ ను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు డిజైనర్ మార్కర్ వీడ్ లిచ్ చెప్తున్నారు. ఫోన్ ను సింగిల్ స్క్రీన్ లోకి మారిస్తే సులభతరం అవుతుందన్న విషయంపై దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. తాను యాపిల్ కోసం సింపుల్ డిజైన్ లాంగ్వేజ్ ను రూపొందించనున్నట్లు తెలిపాడు. హ్యాండ్ సెట్ ను పట్టుకునేందుకు వీలుగా ఉండేట్టు వెనుక బాడీని అల్యూమినియం తో రూపొందించి దానికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ను కూడ పెట్టేందకు ప్లాన్ చేస్తున్నట్లు డిజైనర్ చెప్తున్నారు. ఈ ప్లాస్టిక్ స్ట్రిప్ వినియోగదారులను ఆకట్టుకునే వివిధ రంగుల్లో, డిజైన్లలో ఉండేట్లు రూపొందిస్తున్నారు. దీంతో రాబోయే యాపిల్ ఐ ఫోన్ డిజైన్ పూర్తి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒక్క డిజైన్ మాత్రమే కాక ఇంతకు ముందుకంటే బ్యాటరీ బ్యాక్ అప్ రెట్టుంపు ఉండేట్టు మ్యాక్ బుక్ లైనప్ ను ప్రయోగిస్తున్నారు.
ప్రస్తుతం సంస్థ క్రిస్మస్ సమయానికి ఓ కొత్త యాపిల్ వాచ్, టీవీ, ఐపాడ్ ప్రోను కూడ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తయారీ దారులు చెప్తున్నారు. అంతేకాదు రాబోయే ఐ ఫోన్ 7 కూడ చాలా పలుచగా ఉండి ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉందని వీరంటున్నారు. కేవలం 6 ఎం. ఎం. మందం తో, ఐ పాడ్ 6 కంటే పలుచగా ఉండే అవకాశం ఉన్నట్లు ఎనలిస్టులు అంటున్నారు. ఇంతకు ముందు మార్కెట్లోకి వచ్చిన ఫోన్లు అతి పలుచగా ఉండటంతో జేబుల్లో వంగిపోయినట్లు వినియోగదారులనుంచీ ఫిర్యాదులు ఉన్నాయి. అయితే కొత్తగా రాబోయే ఈ ఫోన్... టచ్ 6.1 ఎం.ఎం. ఉండగా.. స్క్రీన్ కేవలం నాలుగు అంగుళాలు ఉంటుంది. ముఖ్యంగా రాబోయే ఫోన్ అతి పలుచగా ఉండటంతో దీనిలో సిమ్ కార్డు పెట్టే అవసరం కూడ ఉండకపోవచ్చునని అనుకుంటున్నారు.