ఈపిల్ టవర్ వద్ద 40మంది అరెస్టు | French police arrest 40 over Euro 2016 violence | Sakshi
Sakshi News home page

ఈపిల్ టవర్ వద్ద 40మంది అరెస్టు

Jul 11 2016 9:33 AM | Updated on Aug 21 2018 6:12 PM

ఈపిల్ టవర్ వద్ద 40మంది అరెస్టు - Sakshi

ఈపిల్ టవర్ వద్ద 40మంది అరెస్టు

ఫ్రాన్స్లో జరిగిన యూరో 2016 ఫైనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లో అల్లర్లు సృష్టించాలని అనుకున్న 40మందిని పారిస్ పోలీసులు అరెస్టు చేశారు.

పారిస్: ఫ్రాన్స్లో జరిగిన యూరో 2016 ఫైనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లో అల్లర్లు సృష్టించాలని అనుకున్న 40మందిని పారిస్ పోలీసులు అరెస్టు చేశారు. వారందరికి కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. తాము విధించిన నిబంధనలు అతిక్రమించి వ్యవహరించడమే కాకుండా పోలీసులను సైతం లెక్కచేయని విధంగా వ్యవహరించారని, ఒక భయానక పరిస్థితిని సృష్టించారని పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు. అరెస్టయిన వారిలో పోర్చుగల్ వారు, పారిస్ కు చెందినవారు ఉన్నారని అన్నారు.

ఇంకొందరి కోసం గాలింపులు చేపడతున్నామని చెప్పారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు. ఫ్యాన్ జోన్ లోకి అనుమతించలేదని ఇరు దేశాలకు చెందిన కొంతమంది యువకులు ఆందోళన చేపట్టడంతోపాటు వాటర్ బాటిల్స్, చెప్పులు విసరడం, రాళ్లు విసరడంలాంటివి చేశారు. ఇదంతా ఈఫిల్ టవర్ దగ్గర చోటుచేసుకుంది. ఇదికాస్త పెద్దదయ్యే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారిని టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్-రష్యా మ్యాచ్ సమయంలో ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న రచ్చరచ్చగా మారిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement