అంతరిక్షం నుంచి కార్చిచ్చు ఫొటోలు

Astronaut Shares California Wildfires Photos From Space - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అడవుల్లో మరోసారి కార్చిచ్చు రగులుతోంది. కాలిఫోర్నియా, పశ్చిమ లాస్‌ ఏంజెల్స్‌ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు. అక్టోబరు 23న మొదలైన కార్చిచ్చు వల్ల హాలీవుడ్‌ నటులు సహా దాదాపు 10 వేల మంది వెస్ట్‌ లాస్‌ ఏంజెల్స్‌ నివాసులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర కాలిఫోర్నియా, సోనోమా కంట్రీలో నివసిస్తున్న దాదాపు లక్షన్నర మంది అగ్ని ప్రమాద బాధితులుగా మిగిలిపోయారని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన వ్యోమగామి అండ్రూ మోర్గాన్‌ కార్చిచ్చుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న అతడు.. ‘ అంతరిక్షం నుంచి కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటల ఫొటోలు తీశాను. ఈ ఘటనలో ఇళ్లు కోల్పోయిన వారి గురించి, వాళ్లను కాపాడిన సాహసవంతుల గురించి ఆలోచిస్తున్నా అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా అతడి ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ అంతరిక్షంలో ఇంత స్పష్టత ఉన్న లెన్సులు ఉన్నాయా’ అంటూ కొంతమంది సందేహం వ్యక్తం చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఇంత గొప్ప టెక్నాలజీని ఉపయోగిస్తున్న మనం.. కార్చిచ్చు రగలకుండా మాత్రం జాగ్రత్తపడలేకపోతున్నాం. అమెజాన్‌.. ఇప్పుడు ఇది ఇలా ఎన్ని అడవులు నాశనమైనా మానవాళి తీరు మారదు’ అని కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top