గ్యాస్ పేలుడు : కుప్పకూలిన ఐదంతస్తుల భవనం | 20 feared trapped after gas explosion in Russia building | Sakshi
Sakshi News home page

గ్యాస్ పేలుడు : కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

Feb 16 2016 9:37 AM | Updated on Sep 3 2017 5:46 PM

రష్యన్ నగరం యారోస్లావల్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది.

మాస్కో : రష్యన్ నగరం యారోస్లావల్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఐదంతస్తుల భవనంలో శక్తిమంతమైన గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భవనం కుప్పకూలిందని అత్యవసర మంత్రిత్వశాఖ మాస్కోలో వెల్లడించింది. శిథిలాల కింద 20 మంది చిక్కుకున్నట్లు తెలిపింది. నలుగురిని మాత్రం రక్షించినట్లు పేర్కొంది.

ఓ మృతదేహాన్ని మాత్రం శిథిలాల కింద నుంచి వెలికి తీసినట్లు చెప్పింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 40 మంది ఉన్నారని వెల్లడించింది. అయితే స్వల్పగాయాలైన ముగ్గురిని మాత్రం రక్షించినట్లు తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అత్యవసర మంత్రిత్వశాఖ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement