12 మంది భారతీయులు విడుదల | 12 Indians held in Nepal for overstaying, released later | Sakshi
Sakshi News home page

12 మంది భారతీయులు విడుదల

Dec 7 2014 7:58 PM | Updated on Aug 20 2018 4:37 PM

సరైన దృవపత్రాలు లేవంటూ నిన్న అరెస్ట్ అయిన 20 మందిని విడుదల చేసినట్లు నేపాల్ పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు.

ఖాట్మాండ్: సరైన దృవపత్రాలు లేవంటూ నిన్న అరెస్ట్ అయిన 20 మందిని విడుదల చేసినట్లు నేపాల్ పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో వారందరిని విడుదల చేసినట్లు తెలిపారు. శనివారం అరెస్ట్ అయిన మొత్తం 20 మందిలో 12 మంది భారతీయులు కాగా, మరో ఆరుగురు పాకిస్థానీయులని వివరించారు.

పాకిస్థానీయులను విచారించి ... వారిని స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు. వీసా కాల పరిమితి ముగిసిన వీరంతా దేశంలో నివసిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement