తిరుమలగిరికి చెందిన కరణ్(20) అనే యువకుడు అదృశ్యమైనట్టు బొల్లారం ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.
హైదరాబాద్: తిరుమలగిరికి చెందిన కరణ్(20) అనే యువకుడు అదృశ్యమైనట్టు బొల్లారం ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరిలోని సెంట్రల్ బస్తీలో నివాసముండే కరణ్ ఈ నెల 16న నెట్ బిల్లు కడతానంటూ ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులతో పాటు తెలిసిన వారి వద్ద వాకబు చేసినప్పటికి అచూకీ లభించలేదు. దీంతో కరణ్ తల్లి గీత శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.