ఒకే కాన్పులో ఆ నలుగురు.. | Woman gives birth to four babies at one time | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ఆ నలుగురు..

May 31 2016 9:44 PM | Updated on Sep 4 2017 1:21 AM

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన సంఘటన విజయనగర్ కాలనీ నిర్మల మెటర్నటీ అండ్ ఆర్థోపెడిక్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

విజయనగర్ కాలనీ: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన సంఘటన విజయనగర్ కాలనీ నిర్మల మెటర్నటీ అండ్ ఆర్థోపెడిక్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పాత బస్తీ జహనుమా నవాబ్‌సాబ్ కుంటకు చెందిన మహ్మద్ అబ్జుల్ అజీమ్‌తో ఆయేషా సిద్దిఖా (25) వివాహం గత 2 సంవత్సరాల క్రితం జరిగింది. పిల్లలు పుట్టకపోవడంతో గత ఏడాది క్రితం విజయనగర్ కాలనీ ఆస్పత్రిలోని గైనకాలజిస్టు డాక్టర్ కె. నిర్మలను సంప్రదించారు.

ఆమె చికిత్స మేరకు వైద్యం పొందిన అయేషా సిద్దిఖాకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు జన్మించారు. పుట్టిన చిన్నారులందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మహ్మద్ అబ్దుల్ అజీమ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వైద్య చికిత్సలు అందించిన వారిలో డాక్టర్లు మంజుల, రేణుకా ప్రసాద్, లుబ్నా తదితరులున్నారు.

Advertisement

పోల్

Advertisement