breaking news
K. Nirmala
-
ఒకే కాన్పులో ఆ నలుగురు..
విజయనగర్ కాలనీ: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన సంఘటన విజయనగర్ కాలనీ నిర్మల మెటర్నటీ అండ్ ఆర్థోపెడిక్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పాత బస్తీ జహనుమా నవాబ్సాబ్ కుంటకు చెందిన మహ్మద్ అబ్జుల్ అజీమ్తో ఆయేషా సిద్దిఖా (25) వివాహం గత 2 సంవత్సరాల క్రితం జరిగింది. పిల్లలు పుట్టకపోవడంతో గత ఏడాది క్రితం విజయనగర్ కాలనీ ఆస్పత్రిలోని గైనకాలజిస్టు డాక్టర్ కె. నిర్మలను సంప్రదించారు. ఆమె చికిత్స మేరకు వైద్యం పొందిన అయేషా సిద్దిఖాకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు జన్మించారు. పుట్టిన చిన్నారులందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మహ్మద్ అబ్దుల్ అజీమ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వైద్య చికిత్సలు అందించిన వారిలో డాక్టర్లు మంజుల, రేణుకా ప్రసాద్, లుబ్నా తదితరులున్నారు. -
హైదరాబాద్ కలెక్టర్గా రాహుల్ బొజ్జా
కలెక్టర్ నిర్మల బదిలీ సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిర్మల బదిలీపై వెళుతున్నారు. ఆ స్థానంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలోకలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నిర్మలను ఏడు నెలల వ్యవధిలోనే బదిలీ చేయడం అధికార, ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధికారులు, ఉద్యోగులను పారదర్శకంగా పని చేయించడంలో ఆమె కఠినంగా వ్యవహరించారు. సామాజిక పింఛన్లు, భూక్రమబద్ధీకరణలో భాగంగా ఉచిత పట్టాలు పంపిణీ చేయడంలో కలెక్టర్ నిర్మల కీలక భూమిక పోషించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచడం, పనితీరును మెరుగుపరిచే క్రమంలో ఉద్యోగ సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. హైదరాబాద్ జిల్లాలోని అధికార పార్టీ నేతలకు కూడా ఆమెముక్కుసూటితనం మింగుడు పడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ నిర్మల బదిలీ కావటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచారు. సీఎం సొంత జిల్లా అయిన మెదక్ నుంచి బదిలీపై హైదరాబాద్ కలెక్టర్గా రాహుల్ బొజ్జా వస్తున్నారు.