వాక్ ఫర్ లూయిస్.. | walk for loupus on rumatology day | Sakshi
Sakshi News home page

వాక్ ఫర్ లూయిస్..

May 7 2015 10:52 PM | Updated on Sep 4 2018 5:16 PM

ఈ నెల 10న ప్రపంచ రుమటాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుమటాలజీ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు నెక్లెస్‌రోడ్డు జలవిహార్ వద్ద ‘వాక్ ఫర్ లూపస్’ పేరుతో వాక్ నిర్వహించనున్నారు.

హైదరాబాద్: ఈ నెల 10న ప్రపంచ రుమటాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుమటాలజీ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు నెక్లెస్‌రోడ్డు జలవిహార్ వద్ద ‘వాక్ ఫర్ లూపస్’ పేరుతో వాక్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రుమటాలజీ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు జి. నర్సింహులు తెలిపారు. ఈ వ్యాధి గ్రస్థులకు ఎండలో వెళ్తే ముఖంపై మడతలు రావడం, నోట్లో కురుపులు రావడం, కీళ్లనొప్పులు, జుట్టు ఊడిపోవడం, జ్వరం రావడం వ్యాధి లక్షణాలని వ్యాధిని మెదటి దశలోనే గుర్తిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.

వ్యాధిని గుర్తించకుండా అలానే ఉంటే కిడ్నీలు పాడవడం, కళ్లు పోవడం, మెదడుపై ప్రభావం చూపి పక్షవాతం రావడం, ఊపిరితిత్తులు పాడై ప్రాణాపాయ స్ధితికి చేరుకుంటారన్నారు. వ్యాధి ఎక్కువ శాతం 16 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మహిళలకు ఎక్కువగా వస్తుందని, వ్యాధి 10 మందికి సంక్రమిస్తే అందులో 8 కన్నా ఎక్కువమంది మహిళలే ఉంటారని తెలిపారు. వ్యాధి పూర్తిగా నయం కాకున్నా మందులతో దాన్ని నియంత్రించవచ్చునని మెదటిదశలోనే గుర్తిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
(పంజాగుట్ట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement