'ధైర్యముంటే సీఎం సవాల్ను స్వీకరించు' | trs mp balka suman demands to uttam to take kcr Challenge | Sakshi
Sakshi News home page

'ధైర్యముంటే సీఎం సవాల్ను స్వీకరించు'

Aug 25 2016 5:51 PM | Updated on Sep 19 2019 8:44 PM

'ధైర్యముంటే సీఎం సవాల్ను స్వీకరించు' - Sakshi

'ధైర్యముంటే సీఎం సవాల్ను స్వీకరించు'

ఉత్తమ్కు ధైర్యముంటే కేసీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించాలని ఎంపీ బాల్క సుమన్ అన్నారు.

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డికి ధైర్యముంటే సీఎం కేసీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సాగునీటి ప్రాజెక్టుల్లో అడ్వాన్స్ల పేరుతో కాంగ్రెస్ నేతలు పందికొక్కుళ్లా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్కు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. మధుయాష్కీ మతిభ్రమించి మాట్లాడుతున్నారని బాల్క సుమన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement