సామాజిక తెలంగాణే లక్ష్యం: తమ్మినేని | Tammineni comments on Government | Sakshi
Sakshi News home page

సామాజిక తెలంగాణే లక్ష్యం: తమ్మినేని

Feb 14 2017 3:11 AM | Updated on Jul 11 2019 9:04 PM

సామాజిక తెలంగాణే లక్ష్యం: తమ్మినేని - Sakshi

సామాజిక తెలంగాణే లక్ష్యం: తమ్మినేని

సామాజిక తెలంగాణ సాధనే సీపీఎం లక్ష్యమని.. అందుకోసమే మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.

కొణిజర్ల: సామాజిక తెలంగాణ సాధనే సీపీఎం లక్ష్యమని.. అందుకోసమే మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్నామని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. వీరభ్రదం చేపట్టిన పాదయాత్ర సోమవారం తనికెళ్లకు చేరింది. ఓట్లు లేకపోయినా ప్రభుత్వాలను గద్దెదింపే శక్తి కమ్యూనిస్టులకు ఉందని, సీపీఎం చేపట్టిన మహాజన పాద యాత్ర చూసి సీఎం కేసీఆర్‌కు బెదురుపట్టుకుందన్నారు. పాదయాత్రకు నారాయణ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ఆయన ముక్కు కోసి ప్రజలకు పంచిపెట్టి కాలగర్భంలో కలిపేస్తామని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలకు గిన్నిస్‌ బుక్‌ రికార్డు వస్తుందన్నారు. ఎర్రజెండాల ఉద్యమాన్ని నాటి నిజాం నవాబే ఎదిరించలేక పోయాడు సీఎం కేసీఆర్‌ ఏమి ఆపగలుగుతాడన్నారు.  

వీఆర్‌ఏలకు రూ. 18 వేల కనీస వేతనం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్‌: వీఆర్‌ఏ వేతనాన్ని కనీస వేతన చట్టం ప్రకారం రూ.18 వేలకు పెంచాలని ప్రభుత్వానికి సీపీఎం విన్నవించింది. ఉమ్మడి ప్రభుత్వంలో చెల్లించిన విధంగా 010 పద్దు ద్వారానే వారికి వేతనాలివ్వాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సోమవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement