షాక్‌కు గురయ్యాను: కేటీఆర్‌ | Shocked to learn about havoc in Hyderabad | Sakshi
Sakshi News home page

షాక్‌కు గురయ్యాను: కేటీఆర్‌

May 21 2016 7:47 PM | Updated on Aug 30 2019 8:24 PM

షాక్‌కు గురయ్యాను: కేటీఆర్‌ - Sakshi

షాక్‌కు గురయ్యాను: కేటీఆర్‌

నగరంలో శుక్రవారం గాలివానం సృష్టించిన బీభత్సంపై తాజాగా మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు.

హైదరాబాద్‌: నగరంలో శుక్రవారం గాలివానం సృష్టించిన బీభత్సంపై తాజాగా మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. 'దాదాపు 12 గంటల క్రితం అమెరికా చేరుకున్నాను. హైదరాబాద్‌లో గాలివానం తీవ్ర బీభత్సం సృష్టించిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యాను. జీహెచ్‌ఎంసీతోపాటు, ఇతర విభాగాలు నగరంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి తమ శాయశక్తులా కృషిచేస్తున్నాయి' అని ఆయన ట్వీట్‌ చేశారు.

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా విద్యుత్‌ పునరుద్ధరించలేదని తెలిసిందని, ఆ ప్రాంతాల్లో త్వరలోనే పునరుద్ధరిస్తామని కేటీఆర్ అన్నారు. ఎమర్జెన్సీ డయల్ నంబర్ 100 పనిచేయడం, దానికి గవర్నర్ ఉపయోగించుకోవడం ఆనందం కలిగిస్తున్నదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement