వనస్థలిపురం పీఎస్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో సాక్షి విలేకరికి గాయాలు
Jun 28 2017 3:35 PM | Updated on Aug 30 2018 4:10 PM
హైదరాబాద్: వనస్థలిపురం పీఎస్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న మారుతి వ్యాగనర్ కారు (టీఎస్ 08 ఈబీ 2208)అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు అవతలి వైపు వెళ్తున్న ద్విచక్రవావానాలను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ పై విధులకు వస్తున్న సాక్షి విలేకరి జనార్దన్‌ను తీవ్రంగా గాయపడ్డారు. జనార్దన్ కుడి కాలు విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. హస్తినపురం అమ్మ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement