నేనే మిమ్మల్ని సత్కరిస్తా : పొంగులేటి | right of workers to Chicago - ponguleti | Sakshi
Sakshi News home page

నేనే మిమ్మల్ని సత్కరిస్తా : పొంగులేటి

May 1 2015 11:41 PM | Updated on Oct 16 2018 2:49 PM

నేనే మిమ్మల్ని సత్కరిస్తా : పొంగులేటి - Sakshi

నేనే మిమ్మల్ని సత్కరిస్తా : పొంగులేటి

చికాగో కార్మికులు హక్కుల సాధన కోసం పోరాడి 1886 మే 1న ఆత్మబలిదానం చేసుకుని అమరులైన రోజు మే డే అని

సిటీబ్యూరో: చికాగో కార్మికులు హక్కుల సాధన కోసం పోరాడి 1886 మే 1న  ఆత్మబలిదానం చేసుకుని అమరులైన రోజు మే డే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లోటస్ పాండ్‌లోని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి పవిత్రమైన రోజున కార్మికులు నన్ను సత్కరించటం కాదు.. తానే కార్మికులను సన్మానిస్తానని అన్నారు. వైఎస్సార్ కన్న కళల కోసం, కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీతలైన బి. అనంతయ్య, బి. సుభాష్, కె. శ్యాంరావు, ఎస్. మహేశ్, దశరథ, ఎన్. మణ్యం, జె. క్రిష్ణయ్య, ఎం. ఆనంద్‌లను ఎంపీ శ్రీనివాసరెడ్డి సత్కరించి, మెమొంటోలు అందజేశారు. దీంతో కార్మిక సోదరులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి రామచందర్, పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు సత్యం శ్రీరంగం, మజ్‌తబ అహ్మద్, గాదె నిరంజన్ రెడ్డి, జార్జి హెర్బర్ట్, జేఎల్ మేరీ, క్రిష్టోలైట్, నాగదేసి రవికుమార్, కర్నాటి ప్రభాకర్ రెడ్డి, తడకా జగదీశ్వర్ గుప్తా, డి.వనజ, ఎండీ బాబా అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement