ఫేస్‌బుక్ లో వేధిస్తున్నయువకుడు, అరెస్ట్ | man arrested for facebook harassment | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ లో వేధిస్తున్నయువకుడు, అరెస్ట్

Apr 1 2016 12:30 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి నగలను అపహరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి నగలను అపహరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న యువతికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తన పరువు తీస్తానని బెదిరించాడు. ఫొటోలను ఇవ్వాలంటే నగలు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతి ద్వారా యువకుడిన కామినేని హాస్పటల్ వద్దకు వస్తే నగలు ఇస్తానని చెప్పించారు. దీంతో శుక్రవారం ఉదయం హాస్పిటల్ వద్దకు వచ్చిన యువకుడు నగలు తీసుకుంటుండగా అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు అతనిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement