బీజేపీ కార్యకర్తల పనే | janareddy comments on BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యకర్తల పనే

Aug 5 2017 3:10 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ కార్యకర్తల పనే - Sakshi

బీజేపీ కార్యకర్తల పనే

గుజరాత్‌లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి
 
సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. గూండాలు, అనుయాయులతో బీజేపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్‌ ఖూనీ చేస్తోందన్నారు.

దేశంలో విపక్షాలకు స్థానం లేకుండా హింస, నియంతృత్వంతో పాలన సాగుతోందని, దీన్ని ఎదుర్కోవ డంలో కాంగ్రెస్‌ వెనకడుగేయదన్నారు. విచ్ఛిన్న శక్తులు మహానేతలను పొట్టనబె ట్టుకున్నాయని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement