తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూర్చుంటే హైకోర్టు విభజన జరిగిపోతుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూర్చుంటే హైకోర్టు విభజన జరిగిపోతుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం గవర్నర్ నరసింహన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, హైకోర్టు విభజనపై చర్చించారు. సమావేశం అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైకోర్టు విభజనపై గవర్నర్‌తో సమలోచనలు చేశామని చెప్పారు. ఇక్కడి పరిస్థితులను కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సదానందగౌడలకు వివరించామని అన్నారు.
ఆప్షన్స్ విషయంలో పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇద్దరి సీఎంలతో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడరని అన్నారు. తమ పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేత నాగం జనార్థన్‌రెడ్డిపై దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. దాడులు టీఆర్‌ఎస్ రాజకీయ అసమర్థత అని దత్తాత్రేయ ధ్వజమెత్తారు.