జీవో నెంబర్ 123, 124లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పండగ చేసుకున్నారు.
హైదరాబాద్ : జీవో నెంబర్ 123, 124లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పండగ చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం గాంధీ భవన్ వద్ద టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో 123, 124 లను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది రైతులు, రైతు కూలీల విజయమని ఆయన అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని ఉత్తమ్ సూచించారు.