దావత్ అంటే తెలుసా..! | do u know .. dawath means | Sakshi
Sakshi News home page

దావత్ అంటే తెలుసా..!

Feb 12 2014 1:56 AM | Updated on Mar 22 2019 6:16 PM

దావత్ అంటే తెలుసా..! - Sakshi

దావత్ అంటే తెలుసా..!

దిల్‌సుఖ్‌నగర్‌లో గతేడాది ఫిబ్రవరి 21న విధ్వంసం జరగడానికి కొన్ని రోజుల ముందు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ నుంచి ఆ సంస్థ కో-ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు ఇంటర్‌నెట్ ద్వారా వచ్చిన ఆఫ్‌లైన్ మెసేజ్ ఇది. దీన్ని డీకోడ్ చేసిన ముంబై యాంటీ టైస్ట్ స్క్వాడ్ ( ఏటీ ఎస్) అధికారులు ‘హైదరాబాద్‌ను టార్గెట్ చేయాల్సిందే.

 ‘భాయ్ దావత్ కర్లేంగే’... హైదరాబాదీలకు ఈ మాట సుపరిచితమే. అయితే ఉగ్రవాదుల పరిభాషలో దావత్ అంటే ఏమిటో తెలుసా..! వాళ్లు ఆ విందుకు సన్నద్ధమైతే ఏం జరుగుతుందో ఊహించగలరా..? గత ఏడాది ఫిబ్రవరి 21న
 అలాంటి దావత్‌నే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ముష్కరులు దిల్‌సుఖ్‌నగర్‌లో
 చేసుకోవడంతో18 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంతకీ ఆ దావత్ కథాకమామిషు
 తెలుసుకోవాలని అనుకుంటున్నారా..! అయితే
 
  ‘విందు కాదు... విధ్వంసం’ చదవండి.
 
 విందు కాదు.. విధ్వంసం
  పేలుళ్లను ‘దావత్’గా
 పిలిచిన ఉగ్రవాదులు
  కోడ్‌వర్డ్స్‌తో పథకాన్ని అమలు చేసిన వైనం
  యాసీన్ భత్కల్ విచారణలో వెలుగులోకి
  డీకోడ్ చేస్తున్న ముంబై ఏటీఎస్ అధికారులు
 
 సాక్షి, సిటీబ్యూరో:
 ‘వర్క్ నీడ్స్ టు బి డన్ ఇన్ ‘హెచ్’... (‘హెచ్’లో పని పూర్తి చేయాల్సిందే)
 ‘యు షుడ్ ఎరేంజ్ ఫర్ ఏ దావత్’...
 (అక్కడ విందు కోసం నువ్వే ఏర్పాట్లు చేయాలి)
 దిల్‌సుఖ్‌నగర్‌లో గతేడాది ఫిబ్రవరి 21న విధ్వంసం జరగడానికి కొన్ని రోజుల ముందు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ నుంచి ఆ సంస్థ కో-ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు ఇంటర్‌నెట్ ద్వారా వచ్చిన ఆఫ్‌లైన్ మెసేజ్ ఇది. దీన్ని డీకోడ్ చేసిన ముంబై యాంటీ టైస్ట్ స్క్వాడ్ ( ఏటీ ఎస్) అధికారులు ‘హైదరాబాద్‌ను టార్గెట్ చేయాల్సిందే. అక్కడ విధ్వంసానికి నువ్వే ఏర్పాట్లు చేయాలి’ అని ఉందని నిర్థారించారు. యాసీన్ భత్కల్‌తో పాటు అతడి ప్రధాన అనుచరుడు హడ్డీలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న ఏటీఎస్ ఈ తరహాకు చెందిన మరికొన్ని కోడ్‌వర్డ్స్‌ను గుర్తించింది.
 
 గుర్తించే అవకాశం లేని డమ్మీ ఐడీలు...
 పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలో ఉన్న డిఫెన్స్ కాలనీలో తలదాచుకున్న రియాజ్ భత్కల్ భారత్‌లోని తన అనుచరులను సంప్రదించేందుకు, ఆదేశాలు జారీ చేసేందుకు ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్సే ఎక్కువగా వినియోగించినట్లు ఏటీఎస్ గుర్తించింది. అయితే నిఘా వర్గాల సాంకేతిక విశ్లేషణకు కూడా చిక్కకుండా ఉండేందుకు ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఈ సమాచార మార్పిడి చేసుకున్నారని వెల్లడైంది. ఏ కోణంలోనూ తమ వివరాలు బయటపడని, ఎవరూ అనుమానించని విధంగా డమ్మీ పేర్లతో ఐడీలను సృష్టించారని ఏటీఎస్ విచారణలో వెల్లడైంది. రియాజ్ భత్కల్ సృష్టించుకున్న ఐడీల్లో ‘పటారాసింగ్’, యాసిన్ భత్కల్‌కు చెందిన దాంట్లో ‘హెచ్ బహద్దూర్’లతో మొదలయ్యేవి ఉన్నాయని ఏటీఎస్ స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదులు ఎక్కువగా ఫ్రీ ఫోన్‌కాల్స్, ఎస్సెమ్మెస్, మెసెంజింగ్ సర్వీసుల్ని అందించే వెబ్‌సైట్స్‌నే వాడారు.
 
 ఒక్కోటి ఒక్కోసారే వినియోగం...
 ఈ తరహాలో రూపొందించుకున్న ఐడీలను సైతం ముష్కరులు ఎక్కువ కాలం వినియోగించట్లేదు. ఓసారి తయారు చేసుకున్న ఐడీని ఆ సందర్భంలో సంప్రదింపులు, సమాచార మార్పిడి కోసం మాత్రమే వాడారని ఏటీఎస్ గుర్తించింది. మరోసారికి ఇంకో కొత్త ఐడీ సృష్టించుకోవడం వంటి అనేక జాగ్రత్తలు తీసుకుని తమ ‘పనులు’ పూర్తి చేశారు. ప్రతి సందర్భంలోనూ ఒకరి ఐడీ మరొకరికి ఎన్‌క్రిప్టెడ్ ఫైల్స్ రూపంలో ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్‌లోని మెసెంజర్ల సాయంతో పంపుకునే వారు. ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్ మెసెంజర్స్‌లో ఉండే సభ్యులు, వినియోగదారుల సంఖ్య భారీ సంఖ్యలో ఉండటంతో వీటిని గుర్తించడం నిఘా వర్గాలకూ పెను సవాల్‌గా మారింది. ఎన్‌క్రిప్టెడ్ ఫైల్స్ రూపంలో ఉండటంతో ఇది మరింత ఇబ్బందికరంగా పరిణమించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement