కేసీఆర్‌కు జన్మదిన కానుక: హరీశ్ | Birthday present to the KCR: Harish | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు జన్మదిన కానుక: హరీశ్

Feb 17 2016 3:50 AM | Updated on Aug 14 2018 10:54 AM

కేసీఆర్‌కు జన్మదిన కానుక: హరీశ్ - Sakshi

కేసీఆర్‌కు జన్మదిన కానుక: హరీశ్

నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో లభించిన ఘన విజయాన్ని సీఎం కేసీఆర్‌కు జన్మదిన కానుకగా అందజేస్తున్నామని మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో లభించిన ఘన విజయాన్ని సీఎం కేసీఆర్‌కు జన్మదిన కానుకగా అందజేస్తున్నామని మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు వెనుకబడిన తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం టీఆర్‌ఎస్‌కే సాధ్యమని నమ్మి తమ అభ్యర్థిని గెలిపించారన్నారు.

‘కంటి ముందు అభ్యర్థి- ఇంటి ముందు అభివృద్ధి’ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించామని... దీనికి తగినట్లే ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపాల్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. నారాయణఖేడ్‌ను సిద్ధిపేటలా మారుస్తానని ఇచ్చిన మాటకు నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నానని... ప్రతి గ్రామంలో, తండాలో మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పూర్తిచేసే బాధ్యతను తానే తీసుకుంటానని పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా కలసి కష్టపడితేనే ఈ విజయం సొంతమైందన్నారు. త్వరలోనే నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తామని, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement