బేబీ సీక్వెల్ | baby sequel | Sakshi
Sakshi News home page

బేబీ సీక్వెల్

Feb 7 2015 11:45 PM | Updated on Apr 3 2019 8:51 PM

బేబీ సీక్వెల్ - Sakshi

బేబీ సీక్వెల్

కాసుల వర్షం కురిపిస్తున్న అక్షయ్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ‘బేబీ’ సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. దర్శకుడు నీరజ్ పాండే ప్రస్తుతం ధోనీ బయో పిక్చర్ తీయడంలో బిజీగా ఉన్నాడు.

కాసుల వర్షం కురిపిస్తున్న అక్షయ్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ‘బేబీ’ సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. దర్శకుడు నీరజ్ పాండే ప్రస్తుతం ధోనీ బయో పిక్చర్ తీయడంలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన వెంటనే వచ్చే ఏడాది ఆరంభంలో బేబీ సీక్వెల్ సెట్స్‌పైకి వెళుతుంది. 2017 రిపబ్లిక్ డేన విడుదలకు ప్లాన్ చేశారు.
 
 తనకు సీక్వెల్ ఆలోచన వచ్చిన వెంటనే అక్షయ్‌కు చెప్పాడట నీరజ్. మరో ఆలోచన లేకుండా అక్షయ్ ఓకే చెప్పేశాడట. ‘బేబీ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే ఈ ఐడియా నా మదిలో ఉంది. మళ్లీ అదే యూనిట్ సభ్యులు,నిర్మాతలతో కలసి చేయబోతున్న ఈ చిత్రంపై నేనూ ఎంతో ఉత్సుకతకు లోనవుతున్నా’ అని చెప్పాడు నీరజ్‌పాండే. సో... రెండో ‘బేబీ’ కోసం రెండేళ్లు ఆగాల్సిందే మరి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement