అపోలో నుంచి అనూష డిశ్చార్జ్‌  | Anusha discharge from Apollo | Sakshi
Sakshi News home page

అపోలో నుంచి అనూష డిశ్చార్జ్‌ 

Jan 10 2018 2:19 AM | Updated on Aug 30 2018 4:17 PM

Anusha discharge from Apollo - Sakshi

హైదరాబాద్‌: గత శనివారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనూషను మంగళవారం వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. రూ.16 వేల ఆస్పత్రి బిల్లును ఆమె సోదరుడు శ్రీనివాస్‌తోపాటు బంధువులంతా తలా కొంత పోగేసి చెల్లించారు. అనంతరం ఆమెను స్వగ్రామమైన రాజమండ్రి దానయ్యపేటకు తీసుకెళ్లారు. అక్కడే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయిస్తామని శ్రీనివాస్‌ తెలిపారు.

కాగా ఇదే ప్రమాదంలో గాయపడిన అనూషరెడ్డి ఇంకా కోమాలోనే ఉన్నట్లు ఆమె సోదరుడు పిన్నింటిరెడ్డి వెల్లడించారు. మరో రెండు రోజులు ఆగితే ఫలితం ఉండొచ్చని వైద్యులు తెలిపారని చెప్పారు. ఆస్పత్రి బిల్లు ఎంత అన్నది ఇంకా చెప్పలేదని, ఈ విషయంలోనే తీవ్ర ఆందోళనగా ఉందన్నారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తి జైలులో ఉన్నాడని.. ఇక్కడ బిల్లు కట్టలేక, మెరుగైన వైద్యం చేయించలేక తాము నరకయాతన అనుభవిస్తున్నామని ఆయన కన్నీరుమున్నీరయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement