రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పలువురు రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారులను తెలంగాణ పోలీస్‌శాఖ రిలీవ్ చేయబోతోంది.
తాత్కాలిక కేటాయింపులపై రిలీవ్ చేయనున్న రాష్ట్ర పోలీస్ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పలువురు రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారులను తెలంగాణ పోలీస్‌శాఖ రిలీవ్ చేయబోతోంది. తాత్కాలిక కేటాయింపుల కింద పలువురు అధికారులను ఏపీకి కేటాయించినా, శాశ్వత కేటాయింపుల ఆదేశాలు రాకపోవడం వల్ల తెలంగాణలోనే పనిచేస్తున్నారు. వీరిలో నలుగురు అదనపు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు ఉన్నారు. అయితే, శాశ్వత కేటా యింపులు రాకముందే తమను ఏపీకి పంపించాలనుకోవడంపై సదరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు ప్రక్రియ సాగుతున్న వేళ పోస్టుల ఖాళీ కోసం తమను ఏపీకి పంపించేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గతంలోనే తమను ఏపీకి రిలీవ్ చేయాలని పదే పదే విన్నవించినా పట్టించుకోలేదని, ఇప్పటికే ఏపీలో పదోన్నతులు పూర్తయ్యా యంటున్నారు. తెలంగాణలో పనిచేస్తూ ఏపీకి కేటాయించిన 11 మంది అధికారులను ఇక్కడి పోలీసులు రిలీవ్ చేసేందుకు కసరత్తు చేస్తుండగా, మరి తెలంగాణకు కేటాయించి, ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న 9 మంది అధికారులు పరిస్థితి ఏంటన్నది ఈ రాష్ట్ర పోలీసులు ఆలోచించకపోవడం ఆందోళన కలిగిస్తోందని సదరు అధికారులు అంటున్నారు.