రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.
ఢిల్లీ: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయనిక్కడ గురువారం మాట్లాడుతూ బిహార్ ఫలితాలకు నరేంద్ర మోదీ, అమిత్ షా లను బాధ్యులను చేయాలనడం సరికాదన్నారు. 2004, 2009 లలో అద్వానీ నేతృత్వంలో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. ఓట్ల శాతం తగ్గినా మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్లే బిహార్ లో మహాకూటమి గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.