తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు ముందు నిరసనకు దిగారు.
హైకోర్టు వద్ద లాయర్ల నిరసన
Dec 11 2015 2:27 PM | Updated on Apr 7 2019 3:50 PM
చార్మినార్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు ముందు నిరసనకు దిగారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని, ఆర్టికల్ 214 ను గౌరవించాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
Advertisement


