తెలంగాణలోని కరవు పరిస్థితులపై నివేదిక అందించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సోమవారం గవర్నర్‌ను కలవనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణలోని కరవు పరిస్థితులపై నివేదిక అందించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సోమవారం గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల బీజేపీ నేతలు తెలంగాణ జిల్లాల్లో పర్యటించి కరవు పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యల తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో నేతలు గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను కలుస్తారు.