కారాగారంలో కారుణ్యం..?!

Solipeta Ramalinga Reddy writes on Professor Saibaba - Sakshi

అభిప్రాయం

ఆదివాసీల కాళ్లకింది భూమిని పెకిలిస్తున్న అభివృద్ధిని ప్రశ్నించినందుకు కాదు.. వాళ్ల హక్కుల కోసం ప్రపంచ మేధావులను ఏకం చేయబూనడమే ప్రొఫెసర్‌ సాయిబాబ చేసిన మహానేరం. ఆ కారుణ్యమే నేడు కారాగారం పాలయ్యింది.

మేత కోసం అడవికి వెళ్లి  పులి నోటికి చిక్కిన ఆవు తన బిడ్డకు పాలిచ్చి పరుగు పరుగున వస్తా  వదిలిపెట్టమని ప్రాధేయపడితే మనసు కరిగిన పులి ఆవును వదిలేసిందని నా బాల్యంలో  తెలుగు వాచకంలోని ‘ఆవు– పులి’ పాఠ్యాంశంలో చదువు కున్నా. నిజాయితీ, నిబద్ధత బండరాయిలాంటి గుండె ఉన్న మనిషినైనా కదిలిస్తుం దని మా తెలుగు మాస్టారు  చెప్తే  మనసులోనే  మననం చేసుకున్నా. కానీ కాలనాగులు కన్న పిల్లలనే కొరికి తిన్న ట్టుగా కనికరమే లేకుండా రాజ్యం ప్రొఫెసర్‌ సాయి బాబను జైలులోనే చిదిమేయజూస్తోంది. 90 శాతం శారీరక వైకల్యం, అంతకు మించిన అనారోగ్యంతో ప్రొ. సాయిబాబ అంపశయ్య మీదున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. పోలీసుల డైరెక్షన్‌లో ఆయ నను జైలులోనే అనారోగ్యంతో చంపాలని చూస్తున్నారు. జాతీయ మానవ హక్కుల కమిటీ కల్పించుకొని ప్రొ. సాయిబాబ జీవించే హక్కును గౌరవించాలి.

1975 జూన్‌ 25 మనకు ఎప్పటికీ గుర్తే ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని  పటాపంచలు చేసిన రోజు. ‘అత్యవసర పరిస్థి్థతి’ ప్రక టిస్తూ అప్పటి ప్రధాని ఇందిరమ్మ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. రాజ్యాంగం కల్పించిన సర్వ పౌర హక్కు లనూ హరించిన రోజు. నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయిగానీ దండ కారణ్యంలో అప్పుడూ ఇప్పుడూ కూడా ఎమర్జెన్సీనే. ఎందుకంటే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులే నేడూ కొనసా గుతున్నాయి. అప్పుడు అత్యవసర పరిస్థితి అని ప్రకటిం చారు. ఇప్పుడు ప్రకటించకుండానే దానిని అమలు చేస్తున్నారు. విశ్వాసాలు మూఢంగా ఉన్నా ఫరవాలేదు. కానీ అవి బలమైన భావజాలాలు కాకూడదు. దోపిడీ, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే ఆయుధాలు కాకూడదంటూ విశ్వాసాల మీదే పోలీసులు దాడి చేస్తుంటే, పౌర స్వేచ్ఛను కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ.. కార్యనిర్వా హక శాఖ తీరుగా ఆలోచన చేసి పోలీసులు చేసే హక్కుల ఉల్లంఘనకు అంగీకార ముద్ర వేసే ధోరణి క్రమంగా బలపడుతోంది. దేశానికి రాజకీయం అవ సరం. నలుగురు కూడి  ఓ సమస్యకు పరిష్కారం వెతికే ఆద్భుత క్రతువే రాజకీయం. రాజకీయంలో భిన్న ఆలో చనలు ఉంటాయి. అంతులేని విజ్ఞాన శోధన ఉంటుంది. తార్కికం ఉంటుంది. ఏకాభిప్రాయాలు, విస్తృతాభిప్రా యాలు, విభేదాలు ఉంటాయి. వీటిలోంచే భిన్న రాజ కీయాలు పుట్టుకొస్తాయి. ఈ సంఘర్షణలోంచే విప్లవ భావజాలం పుట్టుకొస్తుంది,  అది పరిసరాలను, ప్రాంతా లను, అవసరాలను బట్టి సాయుధ పోరాటంగానూ మారవచ్చు. లేదా శాంతి మార్గంలోనూ నడవవచ్చు.

అప్రకటిత నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న దండ కారణ్య ఆదివాసీల ఉద్యమం ఇందులో భాగమే. అడ విలో పుల్లలేరుకున్నందుకు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్నందుకు ఆదివాసీలను జైళ్లలో పెట్టారు. నిజా నికి మనకన్నా ప్రజాస్వామ్యయుతమైన, చైతన్యమైన ప్రపంచం ఆదివాసీలది. ప్రేమించే హక్కు, సహ జీవనం చేసే హక్కు మన సమాజంలో లేదు. తమదైన ఒక ప్రత్యేక సంస్కృతి, భూభాగం, ఆచార వ్యవహారాలు కలిగిన ఆదివాసీలకు తమదైన రాజ్యాంగం, చట్టం ఉన్నా యన్నది మనం అంగీకరించం. ఆదివాసీలను తుడిచి పెట్టే మానవ హననంగానే  గ్రీన్‌ హంట్‌ జరుగుతోంది. మానవతావాదులు, మేధావులు దీన్ని  వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేశారు. రాజకీయ విశ్వాసాలు ఉన్న వ్యక్తిగా ఢిల్లీ యూనివర్సిటీæ ప్రొఫెసర్‌ సాయిబా బకు ఆదివాసీలపై స్పష్టమైన అవగాహన ఉంది. వాళ్ల హక్కుల కోసం పోరాడాలనే తపన ఉంది. ఆదివాసీ హక్కుల కోసం కడవరకు నిలవాలనే ఆదివాసీ ఉద్యమ బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ల హక్కుల కోసం ప్రపంచ మేధావులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆది వాసీల హక్కుల కోసం మాట్లాడటం కూడా ఈ రాజ్యంలో నేరమే అని నాకు సాయిబాబను చూసిన తరువాతే తెలిసింది.

నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న ప్రొఫెసర్‌ సాయి బాబ ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయ నకు శిక్ష విధించే కొద్ది రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధికి సంబంధించిన ఆపరేషన్‌ మూడు వారా లలో చేయాలని డాక్టర్లు సూచించారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రొ. సాయిబాబకు జైలులో ఏ విధ మైన వైద్య సహాయం అందలేదు. క్లోమ గ్రంధికి సంబం ధించిన నొప్పి తీవ్రతరం అయింది. ఛాతి నొప్పి, గుండె దడ రావడం జరిగింది. జీవించే హక్కులో భాగంగా ప్రొ. సాయిబాబ న్యాయస్థానాల్లో బెయిల్‌ కోసం పిటిషన్‌ పెట్టుకుంటే అంగీకరించలేదు. ఇక్కడో విషయం చెప్పాలి. రూ. వందల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపా దించి, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైల్లో ఉన్న శశికళకు భర్త ఆరోగ్యం బాగాలేదని న్యాయస్థానాలు బెయిల్‌ ఇచ్చాయి. క్రికెట్‌ ఆటను వ్యాపార, వ్యభిచార ఆటగా మార్చి వేల కోట్లు అక్రమంగా సంపాయించి జైలు పాలయిన లలిత్‌మోదీకి, ఆయన భార్య ఆరోగ్యం సరిగా లేదన్న కారణంగా బెయిల్‌ ఇచ్చారు. 90 శాతం శారీరక వైకల్యం, అంతకు మించిన అనారోగ్యంతో బాధ పడుతున్న సాయిబాబకు అవే న్యాయస్థానాలు బెయిల్‌ ఇవ్వకుండా నిరాకరించడంపై విస్తృత చర్చ జరగాలి.


- సోలిపేట రామలింగారెడ్డి

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు,
దుబ్బాక శాసన సభ్యులు ‘ 94403 80141

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top