ఏడిపించే కొత్త ఏడు చేపల కథ

Madabhushi Sridhar Settaricle Article On Lockdown - Sakshi

విశ్లేషణ

లాక్‌డౌన్‌ ప్రకటించగానే వాళ్లెందుకు నడుస్తున్నారు? సరదానా, పనీపాటా లేకనా, మధుమేహం రోగమా? సొంతూరికి బయలు దేరి వేలమైళ్లదూరాలు దాటడానికి అడుగులేస్తూ ప్రాణాలర్పిస్తున్న కార్మికులు వారు. ఇక్కడ రాజ కీయం కాదు, రాజ్యాంగాన్ని చూడాలి. పార్టీని కాదు, పాలకుల్ని అడగాలి. చట్టాల్ని కాదు, చట్టుబండలైన మానవత్వాన్ని అడగాలి. ప్రాణాంతకమైన నేరంచేస్తే, రుజువుచేసి ప్రాణం తీయడమే శిక్ష అని భావించినప్పుడు తప్ప మరే రకం గానూ ప్రాణం తీయవద్దని ఆర్టికల్‌ 21 జనం ప్రాణాలకు భరోసా ఇచ్చింది. అడుగడుగునా అరికాళ్ల రక్తపు మడుగులతో తడిసిపోతూ రాజ్యాంగమా ఉన్నావా అని అడుగుతున్నది. ఇది మన నాగరికత వేసిన కొత్త ముందడుగు అనుకొని మురిసిపోదామా లేక నిలదీసి అడుగుదామా? వలస కార్మికులను ఏడిపించే కొత్త ఏడు చేపల కథ.

మొదటి చేప: అందరికన్నా ముందు, కరోనాకు విరుగుడు వ్యూహం లాక్‌ డౌన్‌ అని ప్రకటించిన వలస కూలీల జీవ రాశి ఉందనే విషయం గుర్తులేదు, అదే ఎండని మొదటి చేప. పత్రికలు టీవీలు గాడాంధకార కాంతి చిత్రాలు చూపిస్తున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్‌ పురుషోత్తములు నిట్టూరుస్తున్నారు. పిల్‌లను చెత్తబుట్టలో వేస్తు న్నారు. కొత్తవి పడుతున్నాయి. 
రెండో చేప: జనవరి 30న కరోనా తొలి బలితీసుకున్నది. ఓవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తున్నా మార్చి 13న మనం ఇదేమంత ఎమర్జెన్సీ కాదన్నాం. ప్రధాని పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాం. వలసకూలీలకు బతుకు భయమేసింది. నాలుగు గంటల నోటీసుతో భారత జాతీయ జనతా అష్టదిగ్బంధనం మార్చి 24న ప్రకటించారు. కోట్లాది వలస కూలీలు భవిష్యత్తు ఆలోచనకు నాలుగ్గంటలు, ప్రమాదమేమీ లేదనే హామీకి, దేశవ్యాప్తలాక్‌ డౌన్‌ కు మధ్య కేవలం రోజులు.  
మూడో చేప: వలస కార్మికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. తిండి, డబ్బు లేదు. యాజమాన్యాలు పూర్తి జీతం ఇవ్వాలని ప్రభుత్వం ఆజ్ఞాపించింది. అప్పటికే పని చోటుకు చాలాదూరమైపోయారు. రెండింతలు రేషన్‌ ఇస్తామన్నారు మార్చి 26న. వారిలో చాలా మందికి రేషన్‌ కార్డే లేదు. ప్రజాపంపిణీలో లేని 8 కోట్ల పేదలకు తిండి పదార్థాలు ఇస్తామని లాక్‌ డౌన్‌ 50వ రోజున ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడున్నారో తెలియని 8 కోట్లమందికి తిండిగింజలు ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు.  
నాలుగో చేప: శ్రామిక రైళ్లన్నీ వలస కూలీలకే. అందమైన పేరు. కాళ్లరిగేట్టు నెత్తురోడేట్టు తిరుగుతున్న కూలీలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఏప్రిల్‌ 29 న ప్రకటించింది ప్రభుత్వం. కూలీలు బయలుదేరిన రాష్ట్రం, చేరవలసిన రాష్ట్రం సమష్టిగా కోరితేనే రైళ్లిస్తామన్నారు. ఎవరు సమన్వయం చేస్తారు? కొన్ని రాష్ట్రాల వారికి కూలీలను బయటకు పంపే ఉద్దేశం లేదు. రాజకీయంగా నువ్వంటే నువ్వని తిట్టుకోవడానికి కొత్త సాకు దొరికింది. 58 రోజుల తరువాత వారి ప్రయాణాల సమన్వయానికి ‘జాతీయ వలసకూలీ సమాచార వ్యవస్థ’ను కేంద్రం ప్రకటించింది.  
అయిదో చేప: వలసకూలీలు హాయిగా సొంతూరికి రైల్లో పోవచ్చు. కాని కరోనాలేదని తేలిన తరువాతే. ఎవరిస్తారీ సర్టిఫికెట్‌? ఎంతిస్తే ఇస్తారు? ఆన్‌లైన్‌ ఫారం నింపాలట.ఆన్‌లైన్లో దరఖాస్తు చేసిన తరువాత దానికేమైందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలి? ఇదంతా లాభం లేదని మళ్లీ నడక ప్రారంభించారు.  
ఆరోచేప: మోదీ ప్రభుత్వం 85 శాతం రైల్వే చార్జీలు భరిస్తాం అని చెప్పింది. ఎంత ఉదారత? రైల్వే పూర్తి చార్జీలు గోళ్లూడగొట్టి మరీ వసూలు చేసింది. ఎంత ఆర్థిక క్రమశిక్షణ? 2011 జనాభా లెక్కల ప్రకారం వలస కూలీలు 5 కోట్ల 60 లక్షలు. అసలు సంఖ్య ఆరున్నరకోట్లు. వీరంతా వెనక్కి రావడానికి రూ. 4,200 కోట్లు కావాలట. ఎవరిస్తారు– ఏ లాభమూ లేకుండా?  
ఏడో చేప: రైల్వే శాఖ 15 లక్షల మంది వలస కూలీలను తరలించామని సగర్వంగా చెప్పుకున్నది. మిగతా ఆరుకోట్ల 35 లక్షల సంగతేమిటి? వారే రోడ్ల మీద నడుస్తున్నది. పిల్లలను భుజాల మీద మోసుకుని, ముసలాయనను చక్రాల సూట్‌కేస్‌మీద, గర్భవతైన భార్యను చక్రాల చెక్కమీద, ఎందుకు వందల మైళ్లు లాక్కుపోతున్నారు? 

ఈ మధ్యలో కేంద్రప్రభువులు రాష్ట్రాలకు మళ్లీ ఉత్తర్వులు–‘రోడ్ల మీద కూలీలను నడవనీయకండి’ అని. ఉత్తరప్రదేశ్‌ కూలీలు రాష్ట్రం హద్దులు దాటడానికి వీల్లేదని ఉత్తర్వులు వేసింది. ఒక జిల్లాలో స్థానికులు కూడా వారికి సాయం చేయరాదని ఆదేశించింది. వలస కూలీలు ఓటర్లు కారా? లేక వారికి హక్కులు లేవా? వాళ్లను ఎవరు నడవమన్నారు? వాళ్లు అలా నడిచి వెళితే మేమేం చేయగలం అని అంటారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. మనం మనుషులమేనా?


మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
(madabhushi.sridhar@gmail.com)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

05-07-2020
Jul 05, 2020, 21:53 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1590 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి....
05-07-2020
Jul 05, 2020, 20:14 IST
న్యూఢిల్లీ : కరోనాను అంతం చేయడంలో దేశీయ వ్యాక్సిన్లు ఏ విధంగా పోటీలో ఉన్నాయో తెలుపుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక...
05-07-2020
Jul 05, 2020, 20:11 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘోరంగా విఫలమయ్యారని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట‌ రెడ్డి...
05-07-2020
Jul 05, 2020, 19:43 IST
కోవిడ్‌-19 నుంచి కోలుకున్న 106 ఏళ్ల వృద్ధుడు
05-07-2020
Jul 05, 2020, 19:37 IST
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్(70) కరోనా వైరస్‌ బారిన...
05-07-2020
Jul 05, 2020, 18:58 IST
జైపూర్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ ప్రభుత్వం కీలక...
05-07-2020
Jul 05, 2020, 18:41 IST
తిరువనంతపురం: కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని దీటుగా నిలువరించేందుకు కోవిడ్‌-19 నిబంధనలను...
05-07-2020
Jul 05, 2020, 18:38 IST
సాక్షి, విశాఖపట్నం: కరోనా నేపథ్యంలో పోలీసుల కృషి అభినందనీయమని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా...
05-07-2020
Jul 05, 2020, 18:00 IST
కోవిడ్‌-19పై పోరుకు దేశీ తయారీ ఉత్పత్తులను చేపట్టామన్న డీఆర్‌డీఓ
05-07-2020
Jul 05, 2020, 15:11 IST
సాక్షి, హైదరాబాద్‌ :  ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానాను చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో ఆమెకు ఉచితంగా...
05-07-2020
Jul 05, 2020, 14:28 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ సెంటర్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. దేశ రాజధానిలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో...
05-07-2020
Jul 05, 2020, 14:09 IST
సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డు సృష్టించింది. వైద్య పరీక్షల్లో 10 లక్షల మార్క్‌ను...
05-07-2020
Jul 05, 2020, 12:10 IST
సాక్షి, హైదరాబాద్‌​: చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రి యాజమాన్యం కరోనా భయాలను సొమ్ము చేసుకుంటున్న వైనం ఆదివారం బయటపడింది. సాధారణ ప్రజలతోపాటు కరోనా...
05-07-2020
Jul 05, 2020, 11:17 IST
జెనీవా: క‌రోనా వైర‌స్ పేషెంట్ల‌కు ఉప‌యోగిస్తున్న యాంటీ మ‌లేరియా డ్ర‌గ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔష‌ధంపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. క‌రోనాను...
05-07-2020
Jul 05, 2020, 10:40 IST
ఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉదృతమవుతుంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రికార్డు...
05-07-2020
Jul 05, 2020, 10:01 IST
క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని సినిమాల షూటింగ్‌ల‌కు స‌డ‌న్ బ్రేక్ ప‌డింది. అయితే తాను సినిమా తీయాల‌నుకుంటే...
05-07-2020
Jul 05, 2020, 08:58 IST
సాక్షి, సంగారెడ్డి/ మునిపల్లి (అందోల్‌): ఆఫ్రికా నుంచి కందులు దిగుమతి చేసుకోవడం ఏమిటని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర...
05-07-2020
Jul 05, 2020, 04:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,000 దాటింది. ఆస్పత్రుల నుంచి శనివారం 376 మంది...
05-07-2020
Jul 05, 2020, 04:01 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 విధుల్లోకి మరో 948 మంది మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎమ్‌ఎల్‌హెచ్‌పీ)లు అందుబాటులోకి రానున్నారు. ఈ...
05-07-2020
Jul 05, 2020, 02:56 IST
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్క వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ఇది అవసరమని భావిస్తోంది. నిజం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top