ఆదివాసీ విప్లవయోధుడు

Article On Tribal leader Birsa Munda - Sakshi

బ్రిటిష్‌ సామ్రాజ్య వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలి ఆదివాసీలలో  ‘బిర్సా ముండా’ పేరెన్నికగన్న వ్యక్తి. 1875 నవంబర్‌ 15న జన్మించిన  ‘బిర్సా ముండా’ స్వాతంత్య్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషిం చారు.. చోటా నాగపూర్‌ ప్రాంతంలో అడవి మీద ఆధారపడే ఆదివాసుల హక్కుల కోసం పోరాటం నడిపాడు. ఆది వాసులు అందరూ చదువుకోవాలని మొట్టమొదటిసారిగా ఉద్యమం సాగించి చైతన్యం నింపారు. కుంతి, తామర్, బసియా, రాంచి ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకుని ఆదివాసీ హక్కుల కోసం మిలిటెంట్‌ ఉద్యమాన్ని నడిపారు. ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటిష్‌ పాలకులు 1900 జనవరి 5న ఆయన ఇద్దరి అనుచరులను కాల్చి చంపారు. ఈ సంఘటన తన మనసును కలచి వేసింది. ఎం ఏ ఫోబ్స్, ఎంసీ సిట్రిడ్‌ పైడ్‌ అనే బ్రిటిష్‌ కమిషనర్లు  ‘బిర్సా ముండా’ను చంపితే రూ. 500 ఇస్తామని రివార్డు ప్రకటించారు.

బ్రిటిష్‌ ఆయుధ బలగాలు దుంబర్‌ హిల్‌ అనే పర్వత ప్రాంతంలో ‘బిర్సా ముండా’పైన కాల్పులు జరిపారు. ఆ ఘటనలో చాకచక్యంగా తప్పించుకున్నాడు. అయితే జంకోపాయి అడవిలో 3 మార్చి 1900న అరెస్ట్‌ అయ్యాడు. 460 మంది ఆదివాసీ ప్రజలను 15 క్రిమినల్‌ కేసులలో బ్రిటిష్‌ వాళ్ళు అక్రమంగా ఇరికించారు. 19 జూన్‌ 1900న ‘బిర్సా ముండా’ జైల్లో చనిపోయాడు. బిర్సా ముండా ఉద్యమ ప్రభావ ఫలితంగా 1908లోలో బ్రిటిష్‌ ప్రభుత్వం చోటా నాగపూర్‌ కౌలు హక్కు దారు చట్టం తీసుకువచ్చింది కానీ. ఈ చట్టం ద్వారా కూడా ఆదివాసీలకు నష్టం వాటిల్లింది.(రేపు ఆదివాసీ విప్లవ యోధుడు బిర్సా ముండా వర్ధంతి)

పి. వెంకటేష్, పాలకుర్తి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top