భారత్, చైనా సహకారం తప్పనిసరి

Article On India And China Relations - Sakshi

సందర్భం

ప్రపంచంలో  పెద్ద ఔషధ కంపెనీలన్నీ అమెరికా, యూరప్‌కు చెందినవే. ఇందులో టాప్‌ ఐదు: ఫైజర్‌ (యూఎస్‌), రాష్, నొవార్టిస్‌ (రెండూ స్విట్జర్లాండ్‌), మెర్క్‌ (యూఎస్‌), గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ (యూకే). ఈ కంపెనీలు కూడా ఇతర దేశాల సరఫరా గొలుసు మీద ఆధారపడే పని చేస్తాయి. ముఖ్యంగా క్రియాశీల పదార్థాలు(ఏపీఐ), తుది ఔషధాల తయారీ విషయంలో ఇండియా, చైనా కీలకపాత్ర పోషిస్తు న్నాయి. కోవిడ్‌–19కు వ్యాక్సిన్‌గానీ, మందుగానీ కనుక్కోవడం ఈ సరఫరా వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అద్భుత ఔషధంగా అభివర్ణించిన హైడ్రాక్సిక్లోరోక్విన్‌ కావచ్చు; తీవ్రమైన కోవిడ్‌–19 కేసుల్లో ఉపయోగి స్తున్న యాంటీవైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌ కావొచ్చు; లేదా భవిష్యత్‌ వ్యాక్సిన్‌ కావొచ్చు; మొత్తంగా ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక ఆరోగ్యం ఈ ఔషధ కంపెనీల మీద ఆధారపడివుంది. అందునా ఈ మహమ్మారిని అరికట్టడంలో ఇండియా, చైనా సహకారం తప్పనిసరి.

క్రియాశీల ఔషధ పదార్థాలను ఉత్పత్తి చేయడం (ఏపీఐ), వాటిని రోగి వాడుకునే విధంగా మాత్ర, సిరప్, ఆయింట్‌మెంట్‌ తదితర రూపాల్లోకి తేవడ మనే రెండు దశలుంటాయి ఔషధ తయారీలో.  అమెరికా దిగుమతి చేసుకునే ఏపీఐల్లో చైనా, ఇండియా ఉమ్మడి వాటా 75–80 శాతం. వీటిని 1990ల మధ్య వరకూ అమెరికా, యూరప్, జపాన్‌ 90 శాతం వాటి కవే తయారు చేసుకునేవి. కానీ ప్రపంచీకరణ ఈ స్థితిని మార్చేసింది. పరిమాణం పరంగా ఔషధ ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. జెనరిక్‌ మందుల ఎగుమతుల్లో ప్రపంచంలో 20 శాతం వాటా ఇండియాదే. మెడిసిన్స్‌ శాన్స్‌ ఫ్రాంటియర్స్‌ సంస్థ ఇండియాను అభివృద్ధి చెందు తున్న ప్రపంచానికి ఔషధాగారం అని అభివర్ణిం చింది. సిప్లా, అరబిందో, ఎమ్‌క్యూర్, హెటిరో, మక్లౌడ్స్, మాట్రిక్స్, రాన్‌బాక్సీ, స్రై్టడ్స్‌ లాంటి భారత కంపెనీలు– ఎయిడ్స్, టీబీ, మలేరియా మీద పోరా టానికిగానూ గ్లోబల్‌ ఫండ్‌ కోసం యాంటీ రెట్రో వైరల్, యాంటీ మలేరియల్‌ ఔషధాల్ని సరఫరా చేయడంలో బ్రహ్మాండమైన పాత్రను పోషిస్తున్నాయి. అలాగే ఆర్థిక రూపేణా వ్యాక్సిన్‌ తయారీలో జీఎస్‌కే, సనోఫి, మెర్క్, ఫైజర్‌ పెద్ద కంపెనీలు అయివుం డొచ్చుగానీ, పరిమాణం పరంగా అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారు ఇండియాకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టి ట్యూట్‌. పుణేలో ఉన్న ఈ కంపెనీ యేటా 150 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 80 శాతం ఎగు  మతి అవుతాయి. యునిసెఫ్‌కు అతిపెద్ద వ్యాక్సిన్‌ సరఫరాదారు ఇండియానే. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అవసరమైన డీపీటీ, టీబీ వ్యాక్సిన్లలో 65 శాతం, మశూచి వ్యాక్సిన్లలో 90 శాతం ఇండియా నుంచే వస్తున్నాయి.

అయితే, ఔషధ పరిశ్రమ ప్రపంచీకరణకు గురయ్యాక, సరఫరా గొలుసు మీద అతిగా ఆధార పడటం భయాందోళనల్ని కలిగిస్తోంది. అమెరికాలో చివరి ఆస్పిరిన్‌ తయారీ పరిశ్రమ 2002లో, చివరి పారాసిటమాల్‌ తయారీ పరిశ్రమ యూరప్‌లో 2008లో మూతపడ్డాయి. ‘ఏపీఐ’ల విషయంలో ప్రస్తుతం ఇండియా కూడా చైనా మీద 70 శాతం ఆధారపడివుండటం భారత ప్రభుత్వం పట్టించు కోవాల్సిన అంశం. బాగా తెలిసిన పారాసిటమాల్, ఎమోగ్జిసిలిన్, ఐబూప్రొఫేన్‌ లాంటి వాటికైతే నూరు శాతం చైనా మీద ఆధారపడివుంది ఇండియా. కోవిడ్‌ లాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు ఇతర దేశాల అవసరాలను తీర్చడం కన్నా చైనా తన నిల్వల్ని తన పౌరుల కోసం వాడుకోవడం సహజం. ఈ అతి కేంద్రీ కరణ ప్రపంచీకరణ, జాతీయవాదాల మధ్య ఘర్ష ణకు కారణమవుతోంది. ఏపీఐల విషయంలో చైనా మీద ఆధారపడటాన్ని భారత ప్రభుత్వం తరచి చూస్తోంది. అతి పెద్ద మొత్తంలో అవసరమయ్యే ఔష ధాల విషయంలో ఈ ఆధారపడటాన్ని నివారించడా నికిగానూ మార్చి 21న మూడు ఔషధ పార్కులు,53 ప్రాధాన్యమున్న ఏపీఐల తయారీ కేంద్రాలకు సహ కారం అందించడం కోసం 14 కోట్ల అమెరికన్‌ డాల ర్లతో పథకం ప్రకటించింది. అలాగే అమెరికాకు చెందిన మైలాన్‌ సంస్థ హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం  హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ఉత్పత్తిలో 70 శాతం ఇండియాదే. ఈ ఔషధ పనితనం మీద చర్చలు సాగుతున్నప్పటికీ, ఒకటి మాత్రం నిజం. ఏ కోవిడ్‌ ఔషధ తయారీలో నైనా అది ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి కోసమైనా, తక్కువ ఖర్చుతో చేయడం కోసమైనా ఇండియా, చైనా భాగస్వామ్యం తప్పనిసరి.

వ్యాసకర్త: రోరీ హార్నర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ సీనియర్‌ లెక్చరర్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top