టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది..! | Smart Touch Can Opener | Sakshi
Sakshi News home page

టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది..!

May 22 2016 2:23 AM | Updated on Sep 4 2017 12:37 AM

టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది..!

టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది..!

ఇంట్లో వంట పనితో.. ఇంటి పనితో సతమతమయ్యే గృహిణులకు మరో కష్టమైన పని కూడా ఒకటుంది..

ఇంట్లో వంట పనితో.. ఇంటి పనితో సతమతమయ్యే గృహిణులకు మరో కష్టమైన పని కూడా ఒకటుంది.. అదే డబ్బాల మూతలు తెరవడం. అంతేకాదు కొత్తగా కొనుక్కొచ్చిన జార్, సీసాల మూతలు తెరిచేందుకు పాపం వారి తల ప్రాణం తోకకొస్తుంది. ఒకవేళ ఎలాగోలా కష్టపడి తెరిచినా, ఒక్కోసారి వాటిలోని పదార్థాలు ఎంతో కొంత కింద పడిపోతుంటాయి. ఇకపై మూతలు తెరిచేందుకు అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మార్కెట్‌లోకి ఓ కొత్త సాధనం వచ్చేసింది. అదే ఈ ‘స్మార్ట్ టచ్ క్యాన్ ఓపెనర్’.

దీంతో మూతలను తెరిచే పని చాలా సులభమవుతుంది. ఈ ఓపెనర్‌ను మనకు కావాల్సిన డబ్బాపై పెట్టి, దానిపై ఉన్న బటన్‌ను ఒకసారి ఆన్ చేసి, ఆఫ్ చేస్తే చాలు. వెంటనే మీ చేతిలో ఉన్న క్యాన్ లేదా డబ్బా మూత ఓపెనైపోతుంది. ఇది ఎలాంటి ఆకారాల్లో ఉన్న మూతలనైనా.. అలాగే ఎలాంటి సైజు డబ్బాల మూతలనైనా ఇట్టే తెరిచేస్తుంది. ఈ ఓపెనర్లు మనకు వివిధ రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement