థీమ్.. పర్‌ఫెక్ట్

థీమ్.. పర్‌ఫెక్ట్


నాట్యం మనోహర

దృశ్యకావ్యమయింది. వెస్ట్రన్ మ్యూజిక్ వీనుల విందు చేసింది. హిందుస్థానీ, కర్ణాటక సంగీతం ‘జుగల్‌బందీ’గా అలరించింది. నాటకం విభిన్నమై మురిపించింది. లామకాన్ ఐదో వార్షికోత్సవం వారం రోజుల పాటు నగరవాసులను సాంస్కృతిక సంబరాల్లో ముంచెత్తింది. పర్‌ఫెక్ట్ థీమ్‌తో కళాభిమానులకు ఓ సరికొత్త అనుభూతిని మిగిల్చింది. ఓ మధు

 

కాంట్రా బ్యాండ్

 వెస్ట్రన్ మ్యూజిక్ ఇష్టపడేవారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం కాంట్రా బ్యాండ్. జాజ్, రాక్, పాప్ మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను షేక్ చేసింది. షకీలా వోకల్, జుర్వాన్ కీబోర్డు, కార్తీక్ కల్యాణ్ డ్రమ్స్, సరోష్, ప్రణతీఖన్నా గిటార్, నికీ శుక్లా వయోలిన్, తానియా శుక్లా లీడ్ వోకల్స్... ఓ వినూత్న సంగీత ఝరి నగరవాసులను నయా లోకాలకు తీసుకెళ్లింది.

 

విలాసిని

కళావంతులు ప్రదర్శించే ఈ నృత్యాన్ని ‘విలాసిని’గా ప్రాచుర్యంలోకి తెచ్చారు స్వప్నసుందరి. ఆమె శిష్యురాలు పూజిత కృష్ణమూర్తి ప్రదర్శించిన ఈ విలాసిని నాట్యం విశేషంగా అలరించింది. ఇతర నాట్య రీతులతో పోలిస్తే ముద్రలు, భంగిమలు భిన్నంగా ఉంటాయి ఇందులో. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీల్లో ప్రవేశం ఉన్న పూజిత తన బృందంతో కలసి గంటన్నరపాటు అద్వితీయ అభినయంతో ఆకట్టుకున్నారు.

 

కదిలించింది...

మన చుట్టూ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ‘బిట్టర్ చాక్లెట్’ డిస్ట్రబింగ్ సబ్జెక్ట్. ఇలాంటి అంశాన్ని నాటకంగా మలచి సామాజిక చైతన్యం కోసం సూత్రధార్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. తొలిసారి ఈ తరహా ప్రదర్శనకు వచ్చాను. నటులు తమ రోల్స్‌ను అద్భుతంగా పండించారు... అన్నారు బ్లూక్రాస్ అధినేత, నటి అక్కినేని అమల.

 

బిట్టర్ చాక్లెట్

సూత్రధార్ గ్రూప్... చైల్డ్ సెక్సువల్ అబ్యూజింగ్ మీద సంధించిన బాణం ఈ నాటకం. మధ్య, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ పోకడలపై పూర్తి స్థాయిలో చర్చించిన పుస్తకం ‘బిట్టర్ చాక్లెట్’. పింకీ ఇరానీ రాసిన ఈ పుస్తకం ఆధారంగా రూపొందిన నాటకం ఆహూతులను ఆలోచింపజేసింది. చూస్తున్నంతసేపూ సున్నితమైన బాల్యంపై కనికరం లేని వారి చేతిలో చితికిపోతున్న పసి మొగ్గలే కనిపిస్తారు.


చిన్నప్పటి చేదు సంఘటన వెంటాడుతూనే ఉంటే... వేధించింది నమ్మకస్తులేనని తలుచుకుంటుంటే... జీవితంలో ముందుకు వెళ్లలేని దుస్థితి. ఫలితం... గతి తప్పిన జీవన ప్రయాణం. అవే కథలు ఈ నాటకంలో. పన్నెండేళ్ల మీరా, అరుణ్, టీనేజీ మోడల్ సావ్యో... ఇలా ప్రతి పాత్రా అయినవారి చేతిలో వంచనకు గురైనవే! దర్శకత్వం పర్వీన్. గణేష్, శివాని, సుప్రియా, షహీన్, రాధ, వినయ్‌వర్మ నటించి మెప్పించారు.

 

జుగల్‌బందీ

అచ్చమైన శాస్త్రీయ సంగీత సంగమం ఈ జుగల్‌బందీ. ఆరాధనా కర్హాడే హిందుస్థానీ, ఎన్‌సీహెచ్ పార్థసారథి కర్ణాటక సంగీతంతో అందించిన గాత్ర మాధుర్యం... కళాభిమానుల మనసు దోచింది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top