
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
‘వ్యవసాయం దండుగమారిద’ని ప్రబోధించిన చంద్రబాబు అందుకు అనుగుణంగానే ఇప్పుడు రెండు, మూడు పంటలిచ్చే భూములనే బదనాం చేయడానికి కంకణం కట్టుకున్నారు.
విశ్లేషణ
‘వ్యవసాయం దండుగమారిద’ని ప్రబోధించిన చంద్రబాబు అందుకు అనుగుణంగానే ఇప్పుడు రెండు, మూడు పంటలిచ్చే భూములనే బదనాం చేయడానికి కంకణం కట్టుకున్నారు. కొత్త రాజధాని, 13 ‘నాజూకు నగరాల’ (స్మార్ట్‌సిటీల) నిర్మాణం ఆయన తలపెట్టిన రైతాంగ వ్యతిరేక ‘యజ్ఞం’లో భాగంగా జరుగుతున్నవే. బతుకుతెరువు మీద భరోసా పోయి లక్షలాది ప్రజలు, వ్యవసాయ కార్మికులు బెంగపడుతున్న సమయంలో నాయకులు బుల్లెట్ రైళ్ల కోసం, ఖరీదైన కార్ల తయారీ పరిశ్రమల కోసం జపాన్‌కు పరుగులు పెడుతున్నారు!
‘తుళ్లూరు ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా నిర్ణయించిన తరువాత ఆ విషయం గురించి కొందరు అపరిపక్వంగా మాట్లాడుతున్నారు. తుళ్లూరును కాదంటే, భూసేకరణ మీద గొడవ చేస్తే దొనకొండకో, నూజివీడుకో రాజధాని తరలి పోతుంది.’ (28-11-2014న విజయవాడలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతు సంఘాల ప్రతినిధులతో వెంకయ్యనాయుడు) ‘వాస్తు ప్రకారమే తుళ్లూరును రాజధానిగా నిర్ణయించాం. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఈ నిర్ణయం మారే అవకాశం లేదు’ (18-11-2014న హైదరాబాద్‌లో జరిగిన రైతుల సమావేశంలో చంద్రబాబు నాయుడు) ముహూర్తాలూ, వాస్తు గురించి తెలుగులో రెండు సామెతలున్నాయి- ‘ముహూర్తం మంచిదయితే ముండమోపి ఎలా అయ్యాడురా!’, ‘వాస్తు గల వారి కోడలు ఒక వరహా ఇచ్చి క్షవరం చేయించుకుంది’ అనీ. తెలుగుజాతిని చీల్చడానికి గత ప్రభుత్వం చేసిన కుట్రకు అనుకూలంగా లేఖ రాసిచ్చిన చంద్రబాబు ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానితోపాటు తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఆయన అనుభవానికి వచ్చి ఉండాలి. ఒక తప్పిదాన్ని సరిదిద్దుకొనే క్రమంలో వరుసగా ఎన్ని తప్పిదాలకు పాల్పడాలో రోజుకొక తీరున ఆయన అనుభవానికి వస్తోంది. విభజన తరు వాత చేతికి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని నికరం చేసే పనిలో ఎన్ని అడ్డ దారులు తొక్కవలసి వస్తోందో! కానీ ఈ సమస్యలకు పరిష్కారాలను ఆయన సింగపూర్‌లోనూ, జపాన్‌లోనూ వెతుకుతున్నారు.
హామీలు ఏమైపోయినట్టు?
విభజన సమయంలో కొత్త రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ప్రకటించాలనీ, కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్లు కావాలని కోరినట్టు, అందుకు కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చినట్టు వారి మాటగా చంద్రబాబు ప్రజలకు చెప్పిన సం గతి మనందరికీ తెలుసు. దీనికి తగ్గట్టుగానే ‘ముందు మీరు విభజించండి! మిగతా సంగతి రేపు అధికారంలోకి వచ్చే మా ప్రభుత్వం చూసుకుంటుంద’ న్నట్టు చిత్రవిచిత్రమైన హావభావ ప్రదర్శనల ద్వారా రాజ్యసభలో నాడు బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, నాటి న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ సౌజ్ఞలు ఇచ్చుకోవడం టీవీ చానళ్లలో ప్రజలు గమనించక పోలేదు. ఇప్పుడు ఏం తేలింది? కొత్త రాష్ట్రం ఎదుగుదల, రాజధాని నిర్మా ణానికి కావలసిన నిధుల విషయంలో ఇరు పక్షాల నేతల నాలుకలు మడతపడు తున్నాయి. ‘ప్రత్యేక ప్రతిపత్తి’ కాస్తా, ప్రత్యేక ప్యాకేజీగా దిగజారింది. రూ. 5 లక్షల కోట్ల మాట మళ్లీ వినపడితే ఒట్టు. ఇలా మాట నిలకడ లేకుండా దారి తప్పిన ఇరువురు నాయుడు బావలు ఇప్పుడు ఎవరికి తోచిన పద్ధతిలో వారు రాజధాని నిర్ణయంలో, స్థల సేకరణ/సమీకరణ విషయంలో రైతులను అదిలిం పులకు, బెదిరింపులకు గురిచేస్తున్నట్టు పత్రికల్లోనూ, టీవీ చానళ్లలోనూ వార్తలు వస్తున్నాయి. తమ తప్పిదాలకు సమర్థనగా చివరికి అవసరమైన పరిస్థితులలో బలవంతంగా అయినా సరే భూ సమీకరణకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు సర్వాధికారాలు దఖలు పరచడం కూడా జరిగింది.
కమిటీ సిఫారసులు ఎందుకు చేదు?
అసలు నూతన రాజధాని నిర్మాణం గురించి సిఫారసు చేయడానికే ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ చేసిన మంచి సూచనలను పక్కకు నెట్టేసి ఒంటెత్తు పోక డతో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు చేయటం అనేక అనర్థాలకు దారితీసింది. చేసేది లేక కేబినెట్ ఉపసంఘమనీ, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ కోసమని ‘ప్రాధికార సంస్థ’ను ఏర్పాటు చేసినా సమస్య ఎటూ తేలక సింగపూర్, జపాన్ యాత్రలు తలపెట్టవలసివచ్చింది. తీరా బాబు బృందం సింగపూర్ యాత్ర బెడిసికొట్టినట్టుంది. రాజధాని నిర్మాణానికి కాదు, అసలు దాని రూపకల్పనకే, ఒక ‘మాస్టర్ ప్లాన్’ తయారు చేయడానికే రూ.1,200 కోట్లు ఇచ్చుకోండని సింగ పూర్ ప్రభుత్వం కోరడంతో ముఖ్యమంత్రి బాబుకి పాలుపోని పరిస్థితి! కేవలం రాజధాని నిర్మాణ పథకం నివేదికను తయారు చేయడానికే రూ.1,200 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేసరికి అధికారులు కూడా గుడ్లు తేలవేసే పరిస్థితి వచ్చిం ది! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక ప్రతిపాదన (స్పెషల్ పర్పస్ వెహి కిల్) కూడా సింగపూర్ ప్రభుత్వానికి నచ్చనట్లు రాష్ట్ర అధికారులు కూడా భావి స్తున్నారని వార్తలొచ్చాయి. అంతేకాదు, రైతులు తమ భూములను ఇవ్వడానికి అంగీకరించిన సందర్భాల్లో కూడా ఆ రైతులకు అదే ప్రాంతంలో ముదరాగా కొంత భూమిని కేటాయించడానికి వీలులేదని సింగపూర్ ప్రభుత్వం సూచించిం ది. వచ్చే జనవరిలోనే హైదరాబాద్ రావాలని ఒక సందర్భంలో సింగపూర్ అధి కారులు, అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన్పటికీ, ఇప్పుడు ఎందుకు తటపటాయి స్తున్నారు? లాభం లేనిదే వ్యాపారి వరదన పోవడానికి సాహించాడు. అదే పరి స్థితి సింగపూర్ ప్రభుత్వానిది కూడా. అసలు సింగపూర్ ప్రభుత్వమే 7,000 కంపెనీలు, బహుళజాతి గుత్త సంస్థల ప్రతినిధి! అందువల్ల సింగపూర్ ప్రభు త్వం ప్రతి ఒక్క అంశాన్నీ వ్యాపార దృష్టితోనే, లాభలబ్ధి కోణం నుంచే అం చనా కట్టుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. (ఎన్‌ఎన్. ఆచార్యులు: దక్కన్ క్రానికల్; నవంబర్ 25). ఈ బాగోతమంతా మొత్తం రాజధాని నిర్మాణ ఖర్చు కోసం పెట్టే పెట్టుబడిలో సింగపూర్‌కు 43 శాతం వాటా, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం వాటా (57 శాతం) అని రాష్ట్ర ప్రభు త్వం హామీ పడిన తర్వాత కూడా నడిచిందని మరచిపోరాదు.
నాజూకు వలసగా మారుస్తారా?
సింగపూర్ యాత్ర కథ అలా ముగియగా, గత వారంలో ప్రారంభమై, ముగిసిన బాబు జపాన్ యాత్రది మరొక తంతు! ఒకనాడు ‘వ్యవసాయం దండుగమారి ద’ని ప్రబోధించిన బాబు అందుకు అనుగుణంగానే ఇప్పుడు రెండు మూడు పంటలిచ్చే భూములనే బదనాం చేయడానికి కంకణం కట్టుకోవడం దురదృ ష్టకరం. కొత్త రాజధాని, 13 ‘నాజూకు నగరాల’ (స్మార్ట్ సిటీల) నిర్మాణం ఆయ న తలపెట్టిన రైతాంగ వ్యతిరేక ‘యజ్ఞం’లో భాగంగా జరుగుతున్నవే. బతుకు తెరువు మీద భరోసా పోయి లక్షలాది ప్రజలు, వ్యవసాయ కార్మికులు బెంగప డుతున్న సమయంలో నాయకులు బుల్లెట్ రైళ్ల కోసం, ఖరీదైన కార్ల తయారీ పరిశ్రమల కోసం జపాన్‌కు పరుగులు పెడుతున్నారు! రేపో మాపో పదవి నుంచి దిగిపోయే ప్రస్తుత జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేతో సమావేశమై ఆయన కనుసన్నల్లో జాపనీస్ గుత్త వ్యాపార సంస్తల ద్వారా రాష్ట్రంలో పరిశ్రమ నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆచరణలో అమలు జరగడానికి అనేక షరతులను బాబు నెరవేర్చవలసి ఉంటుంది. అక్కడి ‘సుమితోమో’ లాంటి కంపెనీలతో కుదుర్చుకున్న ‘వ్యవసాయ యాంత్రీకరణ ఒప్పందం’ వ్యవసాయ కూలీలు లక్షల సంఖ్యలో ఉపాధి కోల్పోయి పట్టణాలకు, నగరాలకు వలసలు పోయే ప్రమాదముంది. బహుశా ‘నాజూకు (స్మార్ట్) నగరాలు’ మాదిరిగానే వీటిని కూడా ‘నాజూకు వలసలు’గా పాలకులు నామకరణం చేస్తారేమో!
జపాన్ ఆంధ్రను ఉద్ధరిస్తుందా?
కానీ జపాన్ ఆర్థిక వ్యవస్థ లోగడ మాదిరిగా అమెరికా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్న రెండవ స్థానంలో నేడు లేదు. అది కునారిల్లి పోతుండగా, అమెరికాకు పోటీ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ జపాన్ స్థానా న్ని చైనా ప్రజారిపబ్లిక్ ఆక్రమించేసింది. అందుకే తన వస్తూత్పత్తి కోసం (మాన్యుఫాక్చరింగ్) చౌకగా శ్రామికశక్తి లభించే ఇండియా లాంటి దేశాలకు పరిశ్రమలను తరలించి లాభాలను తాము జమ కట్టుకోవాలని జపాన్ ప్రభు త్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే ‘సుమితోమో’ లాంటి సంస్థలు సహా ఫుడ్‌ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణపై కేంద్రీకరించిన కార్పొరేట్ సంస్థలు, సూపర్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ కార్పొరేషన్‌లు, నెడో, జె.బి.ఐ.సి. లాం టి నిధులు సమకూర్చే వెయ్యి కంపెనీలను పనికిమాలినవిగా ‘స్టాండర్డ్ అండ్ పూర్’, మూడీ లాంటి మదింపు సంస్థలు ప్రకటించాయి. ఇలా ప్రకటించబడ్డ సంస్థలన్నీ తమ సంపాదనలను, ఆస్తిపాస్తుల వివరాలను గోరంతలు కొండం తలుగా చూపి బ్యాంకులను మోసగించాయని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు! ఈ నేప థ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల పేరిట ప్రవేశించే జపాన్‌తో ఎలాంటి సమ స్యను ఎదుర్కోవాలో ఎవరు చెప్పగలరు? రియల్ ఎస్టేట్ రంగం జపాన్‌లో ఎం దుకు ఎలా కూలుతూవచ్చిందో రుచిర్ శర్మ అనే ఆర్థికవేత్త రాశాడు! ఎరిగి ఎరిగి చేసుకున్న పాపం ఏడ్చి ఏడ్చి పోగొట్టుకుంటేగాని తొలగిపోదట!