అల్లంతో హైబీపీకి కళ్లెం!

Take Ginger And Say Good Bye To High Blood Pressure - Sakshi

ముంబై: మీకు హైబీపీ ఉందా. దీనిని నియంత్రించుకునేందుకు వందల రూపాయలు ఖర్చు పెట్టి మందులు కొంటున్నారా? ఇవి వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదముందని తెలిసినా.. తప్పదని సర్దుకు పోతున్నారా? అయితే, ఇకపై చింతించకండి. నేరుగా వంటగదిలోకి వెళ్లి.. అల్లం ముక్కను తీసుకుని, 4 గ్రాముల ముక్కను తుంచుకుని నమిలి తినండి. రోజూ ఇలా చేయడం ద్వారా హైబీపీతో పాటు రక్తంలోని చక్కెర, శరీరంలోని అధిక కొవ్వు తగ్గిపోవడం ఖాయమని నైజీరియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఇలోరిన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. అల్లం.. హైబీపీని నియంత్రించే అమృతమని పేర్కొన్నారు. అల్లంపై పలు ప్రయోగాలు చేసిన వీరు.. దీనిలోని రసాయనిక గుణాలు, త్వరగా జీర్ణమయ్యే నూనెలు, ఫెనాల్‌ కాంపౌండ్స్‌ వంటివి హైబీపీ నుంచి రక్షణ కల్పిస్తాయని వివరించారు.  

షుగర్‌తో గుండెకు అధిక ముప్పు!
న్యూఢిల్లీ: షుగర్‌తో బాధపడే వారికి గుండెజబ్బుల ముప్పు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. షుగర్‌ రోగులు ఎక్కువగా ఉన్న టాప్‌–10 దేశాల జాబితాలో భారత్‌ కూడా ఒకటి. 6కోట్ల మంది వరకూ ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. వీరిలో 3 కోట్లమందికిపైగా ప్రాథమిక లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారేనని ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ చెబుతోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top