అప్పుడు శ్రీదేవి... ఇప్పుడు త్రిపాఠి! | Naga Chaitanya on a thrilling ride! | Sakshi
Sakshi News home page

అప్పుడు శ్రీదేవి... ఇప్పుడు త్రిపాఠి!

Apr 16 2017 1:55 AM | Updated on Sep 5 2017 8:51 AM

అప్పుడు శ్రీదేవి... ఇప్పుడు త్రిపాఠి!

అప్పుడు శ్రీదేవి... ఇప్పుడు త్రిపాఠి!

అతిలోక సుందరి శ్రీదేవి పేరిట ఓ అరుదైన రికార్డు ఉందండోయ్‌! అదేంటంటే... ఏయన్నార్‌కు జోడీగా నటించిన

అతిలోక సుందరి శ్రీదేవి పేరిట ఓ అరుదైన రికార్డు ఉందండోయ్‌! అదేంటంటే... ఏయన్నార్‌కు జోడీగా నటించిన ఆమె, తర్వాతి కాలంలో ఆయన తనయుడు నాగార్జునకూ జోడీగా నటించారు. అక్కినేని హీరోలు ఇద్దరితోనూ హిట్‌ సినిమాలు చేశారు. బహుశా... తెలుగులో తండ్రీకొడుకుల పక్కన జోడీగా నటించిన తొలి కథానాయిక శ్రీదేవేనేమో! తర్వాత సేమ్‌ ఫ్యామిలీకి చెందిన రెండు తరాల హీరోలతో, వరుసకు తండ్రీకొడులయ్యే వారితో సినిమాలు చేసిన హీరోయిన్లున్నారు.

కానీ, అక్కినేని ఫ్యామిలీలో సేమ్‌ ఫీట్‌ రిపీట్‌ చేసినోళ్లు లేరు. శ్రీదేవి తర్వాత లావణ్యా త్రిపాఠి మళ్లీ ఆ రికార్డ్‌ సొంతం చేసుకున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జునకు జోడీగా నటించి, హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు లావణ్య. ఇప్పుడు కృష్ణ ఆర్‌.వి. మరిమతు దర్శకత్వంలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌తో కలసి వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న సినిమాలో నాగ్‌ తనయుడు నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు. సోగ్గాడితో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే... చైతూతో మోడ్రన్‌ డ్రస్సుల్లో కనిపించనున్నారు. రీసెంట్‌గా చైతూ, లావణ్య మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రీకరించినప్పుడు తీసిన ఫొటోలనే మీరు చూస్తున్నారు. అన్నట్టు... వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపరుందనీ, సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement