సంస్కృతి పునరుద్ధరణకు పూనుకోవాలి | Sakshi
Sakshi News home page

సంస్కృతి పునరుద్ధరణకు పూనుకోవాలి

Published Tue, Aug 20 2013 11:47 PM

సంస్కృతి పునరుద్ధరణకు పూనుకోవాలి

మన కాలంలోని విజ్ఞులు వేదాల గొప్పతనాన్ని కొనియాడారు. మనకు లెక్కించడం నేర్పిన భారతీయులకు మనం ఎంతో రుణపడి ఉండాలి, అది లేకుండా ఏ శాస్త్ర ఆవిష్కరణా సాధ్యమయ్యేది కాదని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వ్యాఖ్యానించారు.
 
 ఈ సృష్టి మొత్తం యోగ. ఈ సృష్టిలో ప్రతిదీ యోగికి అందుబాటులో ఉంటుంది. యోగశక్తితోనే మన పూర్వికులు సృష్టిరహస్యాలను ఛేదించారు. అందుకే మన కాలంలోని విజ్ఞులు వేదాల గొప్పతనాన్ని కొనియాడారు. మనకు లెక్కించడం నేర్పిన భారతీయులకు మనం ఎంతో రుణపడి ఉండాలి, అది లేకుండా ఏ శాస్త్ర ఆవిష్కరణా సాధ్యమయ్యేది కాదని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వ్యాఖ్యానించారు. గత శతాబ్దాలన్నింటితో పోలిస్తే ఈ శతాబ్దపు ప్రత్యేకత వేదాలు అందుబాటులో ఉండటమేనని అణుబాంబుకు పితామహుడైన ఓపెన్ హీమర్ పేర్కొన్నాడు. మనమంతా ఆ రుషులకు వారసులమే, వారి నుంచి అనంతమైన వైదికజ్ఞానాన్ని ఆర్జించాం.
 
 హవనాలకు సంబంధించిన వైదిక విజ్ఞానం అందులో ఒకటి. హవనాలు అంటే హోమాలు, యజ్ఞాలు. అవి కేవలం కర్మకాండలు కావు. అగ్నిశక్తిని సమీకరించి వాతావరణాన్ని శుద్ధి చేసేందుకు ఈ సృష్టిలో ఉన్న శక్తులతో సంయోగపరుస్తాయి. అభివ్యక్తమయ్యే సృష్టిలో అన్ని కోణాలు పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాలతో కూడినవే. వీటన్నింటిలో కూడా అగ్ని ప్రత్యేకస్థానాన్ని కలిగి ఉంది. పంచభూతాల్లో మిగిలిన వాటిని కలుషితం చేయగలరు కాని అగ్నిని చేయలేరు. శుద్ధికి, ఇతర పదార్థాలలో పరివర్తన  తేవడంలో ఇది వాహనంగా ఉంటుంది. హవనంలో అగ్నికి అన్నింటినీ సమర్పిస్తారు. ఇందుకు బదులుగా అగ్ని వీటిని దేవలోకాన్ని పోషించే నిర్దిష్టమైన సువాసనలుగా మారుస్తుంది.

మనం పళ్లు, కాయగూరలపై ఆధారపడి జీవించినట్టే, దేవతలు సువాసనలపై ఆధారపడి జీవిస్తారు. కనుక ఇది సంపూర్ణంగా ఉండటం అత్యంత కీలకం. దీనివల్ల సమర్పించే సమిధ, సామగ్రి, ఘృతం స్వచ్ఛంగా ఎంచుకోవడమే కాకుండా ఉచ్చారణ, భావ స్వచ్ఛత అవసరం అవుతాయి. గురు సన్నిధిలో వైదిక హవనం సమర్పించినప్పుడు అందులో పాల్గొన్నవారికి అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి. అటువంటి హవనంలో హవన కుండం నుంచి పొగ ఎప్పుడూ బయటకు రాదు. అది జల్లే సువాసనలు మనసుకు ఎంతో హాయిని, ప్రశాంతతను, స్వస్థతను చేకూర్చే లక్షణాలను కలిగి ఉంటాయి. హవన అగ్నిపై తమ దృష్టిని నిలిపిన వారికి దీర్ఘరోగాలు నయమవుతాయని శాస్త్రోక్తి. వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా, స్వచ్ఛంగా మారి పక్షులు వచ్చి దగ్గరలో ఉన్న చెట్లపై వాలతాయి. నిజమైన హవనానికి ఉన్న ఆకర్షణ శక్తి అది.
 
 ఈ ప్రతికూల కాలంలో దురదృష్టవశాత్తు మనం మన సంస్కృతిని మరచిపోతున్నాం. అన్యాయాలపై ఎవరూ పోరాటం చేయరు. ఈ సృష్టి గందరగోళమై, చెడు ఆధిపత్యం సాధిస్తుంది. నేడు నదులు ఎండిపోతున్నాయి. ప్రతి రెండు రోజులకొకసారి వరదలు, భూకంపాలు, సునామీల కారణంగా భారీస్థాయిలో విధ్వంసం, దుఃఖం కలుగుతున్నాయని మనం వింటుంటాం.
 
 యోగను స్వస్థత చేకూర్చే ఒక చికిత్స ప్రక్రియగా, ధర్మాన్ని మతంగా, హవనాలను కళ్లను మండించే బూడిదగా, ధూపాలుగా, గొంతుకడ్డం పడేదిగా, దీర్ఘాలు తీసే మంత్రాలుగా, దైవాన్ని ఆవాహన చేసేవిగా గాక సహనాన్ని పరీక్షించేవిగా చూస్తున్నారు. దుర్గంధంతో, వినలేని చప్పుడు ఉన్నచోటుకు విందుకు ఆహ్వానం అందడాన్ని ఊహించుకోండి. మీరు వెడతారా? అందుకు విరుద్ధంగా మళ్లీ తిరిగి రాకూడదనే నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. దేవతల విషయంలోనూ ఇదే నిజం... ప్రస్తుతం కలియుగంలో దేవలోకం పౌష్టికాహార లేమితో ఉంది.
 
 హవనాల నిర్వహణలో కొరత ఉంది. నిర్వహించే వాటిలో కూడా అధికం అవసరమైన స్వచ్ఛత స్థాయి ప్రమాణాలను అందుకోలేవు. ధ్యానకేంద్రాలలో స్వచ్ఛంద సేవకులు మానవాళికి, సృష్టికి సేవ చేయడంలో... కనుమరుగైపోతున్న మన సంస్కృతిని పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి.
 
 యోగి అశ్విని
 వ్యవస్థాపకులు, ధ్యాన్ ఫౌండేషన్

 

Advertisement
Advertisement