
ఆగస్టు 9 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. దీని ప్రభావం వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది.
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: మహేష్‌బాబు (నటుడు), హన్సిక (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. దీని ప్రభావం వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది. ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల ముఖ్యంగా ప్రాపంచిక జీవితం కన్నా ఆధ్యాత్మిక జీవితం పైనే ఎక్కువ మక్కువ ఉంటుంది. వీరి పుట్టిన తేదీ 9. దీనివల్ల వీరు అదృష్టం వల్ల అనుకోకుండా ధనం సంప్రాప్తిస్తుంది.విశాల భావాలతో ఉంటారు. రాజకీయంగా ఎదుగుతారు. సమాజ సేవ చేస్తారు. అయితే వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. ప్రేమవ్యవహారాలలో తలదూర్చకుండా ఉంటే మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. చాలా కాలంగా విదేశీయాత్ర కోసం చేస్తున్న యత్నాలు ఫలిస్తాయి.
విద్యార్థులకు విదేశాలలో చదవాలనే కోరిక తీరుతుంది. వేదపండితులు, స్వామీజీలు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఈ సంవత్సరం ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అయితే ఈ సంవత్సరం ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అవసరం. వీలయినంత వరకు ప్రశాంతంగా ఉంటూ, యోగ, ధ్యానాలలో గడపడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,5,6,7,9; లక్కీకలర్స్: రెడ్, గ్రే, గోల్డెన్, శాండల్, బ్లూ, సిల్వర్; లక్కీ డేస్: సోమ, మంగళ, శుక్రవారాలు; లక్కీమంత్స్: జనవరి, మార్చి, జులై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, పార్వతీదేవి పూజ, వికలాంగులకు, అనాథలకు అన్నదానం చేయడం, సోదరులకు సాయం చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్