మళ్లీ మళ్లీ పెళ్లికూతురు... | Bride again and again ... | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ పెళ్లికూతురు...

Oct 5 2015 11:20 PM | Updated on Aug 24 2018 8:18 PM

మళ్లీ మళ్లీ పెళ్లికూతురు... - Sakshi

మళ్లీ మళ్లీ పెళ్లికూతురు...

ఈ ఫొటోలోని అమెరికన్ పెద్దావిడ పేరు లిండా టేలర్. వయసు 69 ఏళ్లే. ‘యమలీల’లో తోటరాముడు ‘పెళ్లి..

తిక్క లెక్క
 
ఈ ఫొటోలోని అమెరికన్ పెద్దావిడ పేరు లిండా టేలర్. వయసు 69 ఏళ్లే. ‘యమలీల’లో తోటరాముడు ‘పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ...’ అని కవిత రాస్తే జనాలు కామెడీగా తీసుకున్నారు గానీ, లిండా టేలర్ మాత్రం మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకోవడంలో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు ఈమెకు 23 పెళ్లిళ్లయ్యాయి మరి. విశేషం ఏమిటంటే, ఈమె పన్నెండేళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. తగిన వరుడు దొరకాలే గానీ, మళ్లీ పెళ్లి చేసుకుంటానని ముసిముసి నవ్వులు నవ్వుతూ చెబుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement