జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపు జరిగే 9 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపు జరిగే 9 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించింది. బందోబస్తులో ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 70 మంది ఎస్సైలు, 100 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 150 మం ది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు పాల్గొంటున్నారు.
మద్యం దుకాణాలు, బార్‌ల మూసివేత
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు జిల్లాలోని 203 మద్యం దుకాణాలు, 10 బార్లను మూసివేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆదేశించారు. లెక్కింపు పూర్తయ్యాక మంగళవారం సాయంత్రం దుకాణాలను తెరువనున్నారు. మద్యం దుకాణాలతోపాటు జిల్లా అంతటికీ మద్యం సరఫరా చేసే బాట్లింగ్ యూ నిట్‌ను కూడా ఇప్పటికే మూసివేశారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ మద్యం అక్రమ సరఫరా, అమ్మకాలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. అవసరమైతే దాడులు జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.