రేపు ప్రకాశం, నెల్లూరు జెడ్పీ చైర్మన్ల ఎన్నిక | ZP elections of Prakasam, Nellore to be held | Sakshi
Sakshi News home page

రేపు ప్రకాశం, నెల్లూరు జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

Jul 12 2014 9:49 PM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు, ప్రకాశం జిల్లా జెడ్పీ, వైస్ చైర్మన్లును ఎన్నుకుంటారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రలోభాలు, దౌర్జన్యాల కారణంగా వాయిదా పడిన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక ఆదివారం జరగనుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లా జెడ్పీ, వైస్ చైర్మన్లును ఎన్నుకుంటారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కాలి. అయితే, ఎన్నికల సందర్బంగా టీడీపీ నాయకులు వీరంగం సృష్టించడంతో వాయిదా పడ్డాయి. వైఎస్ఆర్ సీపీ జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురిచేయడం, లొంగనివారిపై దాడులకు దిగడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఘర్షణ వాతావరణం మధ్య ఎన్నికలను వాయిదా వేశారు. అధికార పార్టీ ఆగడాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ చేసిన దౌర్జన్యాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ నాయకుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement