మా పొత్తు చారిత్రక అవసరం: వెంకయ్య | Our alliance with the historical needs: Naidu | Sakshi
Sakshi News home page

మా పొత్తు చారిత్రక అవసరం: వెంకయ్య

Apr 20 2014 2:37 AM | Updated on Mar 29 2019 9:24 PM

మా పొత్తు చారిత్రక అవసరం: వెంకయ్య - Sakshi

మా పొత్తు చారిత్రక అవసరం: వెంకయ్య

టీడీపీ, బీజేపీ పొత్తు చారిత్రక అవసరమని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాజంపేట లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి శనివారం చిత్తూరులో నామినేషన్ దాఖలు చేశారు.

చిత్తూరు  టీడీపీ, బీజేపీ పొత్తు చారిత్రక అవసరమని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాజంపేట లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి శనివారం చిత్తూరులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పొత్తు ఎంతైనా అవసరమన్నారు. అనివార్య కారణాలతో రెండు పార్టీల మధ్య పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడిన మాట వాస్తవమేనని చెప్పారు. కొంతమంది నాలుగో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, టెంట్ వేసినంత సులభంగా ఫ్రంట్‌లను ఏర్పాటు చేయలేరని ఎద్దేవా చేశారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement