మేం లేకుండా కేంద్రంలో సర్కారు లేదు | No one can form the next government without Trinamool, says Mamata banerjee | Sakshi
Sakshi News home page

మేం లేకుండా కేంద్రంలో సర్కారు లేదు

Mar 26 2014 3:55 PM | Updated on Aug 20 2018 9:16 PM

మేం లేకుండా కేంద్రంలో సర్కారు లేదు - Sakshi

మేం లేకుండా కేంద్రంలో సర్కారు లేదు

కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించనుందని, అసలు తమ మద్దతు లేకుండా ఏ ప్రభుత్వమూ కేంద్రంలో ఏర్పడలేదని ఫైర్ బ్రాండ్ నాయకురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించనుందని, అసలు తమ మద్దతు లేకుండా ఏ ప్రభుత్వమూ కేంద్రంలో ఏర్పడలేదని ఫైర్ బ్రాండ్ నాయకురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నెంబర్ వన్గా ఉండి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తాము ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంటామని పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నారు. డార్జిలింగ్లో పోటీ చేస్తున్న మాజీ ఫుట్బాలర్ బైచుంగ్ భూటియా తరఫున ఆమె ప్రచారం చేశారు.

జీజేఎం మద్దతుతో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎస్ఎస్ అహ్లూవాలియాపై ఆమె మండిపడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ కొండప్రాంతాలను చెదరగొట్టకుండా మళ్లీ ఢిల్లీకే వెళ్లిపోవాలని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చినవాళ్లు గెలిచిన తర్వాత మళ్లీ ఢిల్లీకే పారిపోతున్నారన్నారు. అలాంటివాళ్లు ఇక్కడకు రాకుండా ఢిల్లీలోనే ఉండిపోవాలని సలహా ఇచ్చారు. బెంగాల్లో సీపీఎం, బీజేపీ కాంగ్రెస్లకు ఓట్లేమీ రాలవని, ఇక్కడి ఓట్లన్నీ తమకే వస్తాయి కాబట్టి ఢిల్లీలో కీలక పాత్ర పోషించేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. డార్జిలింగ్కు కేంద్రం ఏమీ చేయలేదని, ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజి కోసం తాము డిమాండ్ చేస్తున్నామని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement