మున్సిపల్ కౌంటింగ్‌కు అంతా సిద్ధం | muncipal counting all to ready | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కౌంటింగ్‌కు అంతా సిద్ధం

May 12 2014 3:03 AM | Updated on Oct 16 2018 6:08 PM

మున్సిపల్ కౌంటింగ్‌కు అంతా సిద్ధం - Sakshi

మున్సిపల్ కౌంటింగ్‌కు అంతా సిద్ధం

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నిర్వహించే కౌంటింగ్ కోసం నల్లగొండ పట్టణ శివారులోని సాగర్‌రోడ్డులో గల డాన్‌బోస్కో స్కూల్‌లో చేసిన ఏర్పాట్లను ఆదివారం రాత్రి కలెక్టర్ చిరంజీవులు, ట్రైనీ జేసీ సత్యనారాయణ, ఇతర అధికారులు పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు, టేబుళ్లతో పాటు ఆరుబయట టెంట్లు, కుర్చీలు  పరిశీలించారు.

కౌంటింగ్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మీడియా సెంటర్‌ను పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా ఉన్నాయంటూ నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డిని అభినందించారు. అభ్యర్థులు, ఏజెంట్లకు  ఇబ్బంది కలుగకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement