బాబు అభివృద్ధి చేసింది ఒక్క జూబ్లీహిల్స్‌నే! | Chandrababu Naidu has developed only one Jubilee hills | Sakshi
Sakshi News home page

బాబు అభివృద్ధి చేసింది ఒక్క జూబ్లీహిల్స్‌నే!

Mar 26 2014 4:29 AM | Updated on Sep 27 2018 5:59 PM

బాబు అభివృద్ధి చేసింది ఒక్క జూబ్లీహిల్స్‌నే! - Sakshi

బాబు అభివృద్ధి చేసింది ఒక్క జూబ్లీహిల్స్‌నే!

రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఊసరవెల్లిలా తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతున్నారని..

రఘువీరా, చిరంజీవి ఎద్దేవా
 సాక్షి, నెల్లూరు/తిరుపతి: రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఊసరవెల్లిలా తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి చిరంజీవి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబునాయుడు కేవలం జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయగలిగారని ఎద్దేవా చేశారు. రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లించే ఆయనకు సీమాంధ్రను సింగపూర్‌గా మార్చడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ద్రోహి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేనని, రాష్ట్ర విభజనకు ప్రతిపక్షాలు ఒకరకంగా దోహదపడితే ముఖ్యమంత్రిగా కిరణ్ ప్రత్యక్షంగానే దోహదపడ్డారని వెల్లడించారు. ఏపీసీసీ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం నెల్లూరుకు వచ్చిన చిరంజీవి ఒక హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు.
 
 సాయంత్రం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగిన సభలో రఘువీరా, చిరంజీవి ప్రసంగించారు. రాష్ట్ర విభజన విషయం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ముందే తెలిసినా ఎప్పటికప్పుడు తప్పుదోవపట్టిస్తూ నాటకాలాడారని వారు విమర్శించారు.  కేంద్రమంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, తిరుపతి ఎంపీ చింతా మోహన్, పలువరు మాజీ మంత్రులు, పార్టీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement