‘చంద్రబాబు అలా చెప్పుకోవడం సిగ్గుచేటు’ | ysrcp leader ananta venkatrami reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అలా చెప్పుకోవడం సిగ్గుచేటు’

Jan 9 2017 11:06 AM | Updated on Jul 28 2018 3:33 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 50 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్‌పై ఉద్యమం సాగిందని, అలాంటిది చంద్రబాబు తనవల్లే పోలవరం సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

వంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలో వైఎస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్రకు అన్నదాతలు బ్రహ్మరథం పడుతున్నారని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లో వైఎస్‌ జగన్‌ ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement