నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభించిన ప్రభు


విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. రైలుమార్గం ద్వారా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాయలసీమను కలుపుతున్నామన్నారు. మంగళవారం డీఆర్ఎమ్ కార్యాలయంలో కేంద్రమంత్రి సురేష్ ప్రభు... నంద్యాల - ఎర్రగుంట్ల 123 కిలోమీటర్ల రైలుమార్గాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు.


అలాగే నంద్యాల - కడపకు డిమో రైలును సురేష్ ప్రభు, చంద్రబాబుతోపాటు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. నంద్యాల - ఎర్రగుంట్ల మార్గం ద్వారా విజయవాడకు నేరుగా రైలు మార్గం ఏర్పడింది. ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ. 967 కోట్లు వ్యయం అయింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top